ఆదోనిలో తమిళనాడుకు చెందిన ముగ్గురి ఆత్మహత్యాయత్నం: ఒకరి మృతి

Published : Apr 11, 2023, 10:47 AM ISTUpdated : Apr 11, 2023, 01:10 PM IST
ఆదోనిలో  తమిళనాడుకు  చెందిన  ముగ్గురి  ఆత్మహత్యాయత్నం: ఒకరి మృతి

సారాంశం

కర్నూల్ జిల్లాలోని ఆదోనిలో  తమిళనాడుకు  చెందిన  ఒకే కుటుంబానికి  చెందిన ముగ్గురు  ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డారు. వీరిలో  ఒకరు మృతి చెందారు.

కర్నూల్: జిల్లాలోని  ఆదోనిలో  రైలు కింద పడి  ఒకే కుటుంబానికి  చెందినముగ్గురు  ఆత్మహత్యాయత్నానికి  ప్రయత్నించార.  రన్నింగ్ ట్రైన్ నుండి    ముగ్గురు  కిందకు దూకారు.. అయితే  ఈ ఘటనలో ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  పద్మనాభం అనే వ్యక్తి  మృతిచెందాడు. పద్మనాభం, అతని భార్య, కూతురు గాయాలతో  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్నారు. 

తమిళనాడులోని  వేలూరు  జిల్లాకు  చెందిన  పద్మనాభం  తన  భార్య, కూతురితో  కలిసి  రైలులో  ప్రయాణం  చేస్తున్న సమయంలో  ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డారు  ఆదోని  వద్ద  రన్నింగ్  ట్రైన్  నుండి  ముగ్గురు దూకారు. ఈ ప్రమాదంలో  గాయపడిన  వారిని ఆదోని ఆసుపత్రిలో  చికిత్స అందించారు. అనంతరం  కర్నూల్ కు తరలించారు.  కర్నూల్ ఆసుపత్రిలో  చికిత్స  పొందుతూ  పద్మనాభం  మృతి చెందారు. పద్మనాభం  భార్య, కూతురు గాయాలతో బయటపడ్డారు. 

  అల్లుడు వేధింపులు  భరించలేక   ఆత్మహత్యాయత్నానికి  పాల్పడినట్టుగా  చెబుతున్నారు.    కరోనా  సమయంలో  పెద్ద కూతురు  మరణించింది.  చిన్న కూతురికి పెళ్లి  చేశారు.  కానీ  చిన్న కూతురు భర్త  వేధింపులు  భరించలేక  ఆత్మహత్యాయత్నానికి  పాల్పడినట్టుగా  బాధితులు  చెబుతున్నారు.  

PREV
click me!

Recommended Stories

AP Food Commission Serious: ఈ హాస్టల్ కంటే జైల్ బెటర్.. పిల్లలు ఏడుపే తక్కువ | Asianet News Telugu
బిలాయి నుండివచ్చాం.. ఆంధ్రాకల్చర్ ని ఎంజాయ్ చేశాం:Visakhaలో Bhogi Celebrations | Asianet News Telugu