కడపలో విషాదం:ఇద్దరు కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య

Published : Feb 28, 2020, 08:32 AM IST
కడపలో విషాదం:ఇద్దరు కూతుళ్లతో సహా తండ్రి ఆత్మహత్య

సారాంశం

కుటుంబ కలహలతో ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను బాలకొండయ్య, శోభన, భావనలుగా గుర్తించారు.


కడప: కడప జిల్లా గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఒకే కుటంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహలతోనే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. 

శ్రీనివాసపురం గ్రామానికి చెందిన బాలకొండయ్యతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు భావన, శోభనలు వ్యవసాయబావిలో శవాలుగా తేలారు. గురవారం నాడు సాయంత్రం నుండి ఈ ముగ్గురు కన్పించకుండాపోయారు. స్థానికులు వారి కోసం వెదికారు. కానీ ఆచూకీ లభ్యం కాలేదు.

ఇవాళ ఉదయం పొలానికి వెళ్తున్న స్థానికులు వ్యవసాయబావిలో మూడు మృతదేహలను గుర్తించారు. మృతదేహలను బాలకొండయ్యతో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు భావన, శోభనవిగా గుర్తించారు.

Also read:ఏకాంత ఫోటోలు, వీడియోలతో వేధింపులు: మాజీ భర్తపై ఫిర్యాదు

గత ఏడాది క్రితమే బాలకొండయ్య భార్య బుజ్జమ్మ ఆత్మహత్య చేసుకొంది.  గురువారం నాడు ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ముగ్గురి ఆత్మహత్యకు కుటుంబ కలహలే కారణంగా గ్రామస్తులు చెబుతున్నారు.

ఏడాది వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడడం గ్రామంలో విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం