ఎట్టకేలకు విశాఖ పోలీసులు పంతం నెగ్గించుకున్నారు. తనను బయటకు పంపాలని ఉదయం నుంచి భీష్మించుకుని కూర్చొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమానం ఎక్కించారు. ఈ సమయంలో విజయవాడ విమానం లేకపోవడంతో ఆయనను హైదరాబాద్ విమానం ఎక్కించారు పోలీసులు
ఎట్టకేలకు విశాఖ పోలీసులు పంతం నెగ్గించుకున్నారు. తనను బయటకు పంపాలని ఉదయం నుంచి భీష్మించుకుని కూర్చొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును విమానం ఎక్కించారు.
ఈ సమయంలో విజయవాడ విమానం లేకపోవడంతో ఆయనను హైదరాబాద్ విమానం ఎక్కించారు పోలీసులు. అయితే తమ అధినేతను పోలీసులు బలవంతంగా హైదరాబాద్ పంపారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Also Read:విశాఖలో చంద్రబాబు అరెస్ట్, ఎయిర్‌పోర్ట్ లాంజ్‌కు తరలింపు
ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ఆయన ఉత్తరాంధ్ర పర్యటన నిమిత్తం విశాఖకు వచ్చారు. అయితే పోలీసులు, వైసీపీ నేతలు చంద్రబాబును అడ్డుకోవడంతో ఆయన ఉదయం నుంచి ఇప్పటి వరకు విమానాశ్రయంలోనే బైఠాయించారు.
ఆ పరిసరాల్లో ఉద్రిక్తత నెలకొనడంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. ముందుగా చంద్రబాబును ఎయిర్‌పోర్ట్ లాంజ్‌కు తరలించేందుకు గాను సెక్షన్151 కింద నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశారు. ఆ వెంటనే టీడీపీ నేతలు నక్కా ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Also Read:నన్ను షూట్ చేయండి: పోలీసులపై చంద్రబాబు మండిపాటు
‘‘ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారు అయిన మీ యొక్క భద్రత దృష్ట్యా మిమ్ములను మరియు మీ అనుచరులను రక్షణ నిమిత్తము సీఆర్‌పీసీ 151 సెక్షన్ ప్రకారం ముందస్తు అరెస్ట్ చేస్తూ ఈ నోటీస్ ద్వారా మీకు తెలుపుతున్నాము. ఇందుకు మీరు సహకరించవలసిందిగా కోరుచున్నామని’’ నోటీసులో పేర్కొన్నారు.
ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితిపై వారితో చర్చించారు. ఆయన హైదరాబాద్ బయలుదేరడంతో తెలుగుదేశం శ్రేణులు విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్నాయి.