బాపట్ల జిల్లా : సముద్రంలో పడవ బోల్తా.. ముగ్గురు గల్లంతు

Siva Kodati |  
Published : Aug 20, 2023, 08:32 PM IST
బాపట్ల జిల్లా : సముద్రంలో పడవ బోల్తా.. ముగ్గురు గల్లంతు

సారాంశం

బాపట్ల జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. సముద్రంలో కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయివర్ణిక అనే మహిళతో పాటు తనీష్, తరుణేశ్వర్‌ అనే చిన్నారులు గల్లంతయ్యారు. 

బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు గల్లంతయ్యారు. నిజాంపట్నం హార్బర్ ఎంట్రన్స్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం వెళ్తుండగా సముద్రంలో కెరటాల ఉద్ధృతికి పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సాయివర్ణిక అనే మహిళతో పాటు తనీష్, తరుణేశ్వర్‌ అనే చిన్నారులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్