తిరుపతి జిల్లాలో విషాదం : చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

Siva Kodati |  
Published : Aug 20, 2023, 07:18 PM IST
తిరుపతి జిల్లాలో విషాదం : చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్య

సారాంశం

తిరుపతి జిల్లా భాకరాపేట అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను రామ సముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన బోడి కళ్యాణి.. చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్‌గా గుర్తించారు. 

తిరుపతి జిల్లా భాకరాపేటలో విషాదం నెలకొంది. ఉరేసుకుని ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రామ సముద్రం మండలం చిట్టెంవారిపల్లెకు చెందిన బోడి కళ్యాణి.. చౌడేపల్లి మండలం లద్దకానికి చెందిన యుగంధర్ బుగ్గనూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. గత కొన్ని నెలలుగా వీరు ప్రేమలో వున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం పశువులను కాసేందుకు కాపరులు అడవిలోకి వెళ్లగా అక్కడ ప్రేమ జంట చెట్టుకు వేలాడుతూ కనిపించారు. దీనిపై పశువుల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టానికి తరలించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu