
ప్రకాశం : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వ దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైకును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు అంబాపురం వాసులు వినోద్, నాని, వీరేంద్రలుగా గుర్తించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.