మేకులు కొడితే దోషం పోతుందట.. క‌మీష‌న్ ఇవ్వ‌కుంటే శాపం త‌గులుతుంద‌ట‌.. దొంగ‌ బాబా బాగోతం..

Published : Aug 19, 2023, 02:47 AM IST
మేకులు కొడితే దోషం పోతుందట.. క‌మీష‌న్ ఇవ్వ‌కుంటే శాపం త‌గులుతుంద‌ట‌.. దొంగ‌ బాబా బాగోతం..

సారాంశం

Krishna District: స్థ‌లం అమ్ముడుపోవాలంటే ప్ర‌త్యేక పూజ‌లు చేయాలనీ, నాలుగు మేకులు స్థలంలో పాతాలని పేర్కొంటూ ఈ తతంగం పూర్తి చేసిన తర్వాత రెండున్నర లక్షల రూపాయలు కాజేయడంతో పాటు ఆ తర్వాత కూడా మరింత కమీష‌న్ ఇవ్వాల‌నీ, లేకుంటే శాపం త‌గులుతుందంటూ భయపెడుతూ మోస‌గించిన దొంగ‌బాబా బాగోతం ఏపీలో వెలుగుచూసింది.   

Fake Baba Cheated Vijayawada Woman: ల‌క్ష‌ల ఖ‌ర్చుపెట్టి కొన్న‌ స్థ‌లం అమ్ముడుపోవ‌డం లేద‌ని ఒక మ‌హిళ బాబాను ఆశ్ర‌యించ‌గా, ప్ర‌త్యేక పూజ‌లు చేల‌య‌ని చెప్పాడు. స్థ‌లంలోని నాలుగు దిక్కుల మేకులు పాతించాడు. ఈ క్ర‌మంలోనే మోసానికి తెర‌లేపుతూ వారి వ‌ద్ద నుంచి లక్ష‌ల రూపాయ‌లు క‌మీష‌న్ కాజేశాడు. మ‌రింత ఇవ్వాల‌నీ, లేకుంటే శాపం త‌గులుతుందంటూ మోస‌గించిన దొంగ‌బాబా బాగోతం ఏపీలో తాజాగా వెలుగుచూసింది. బాధితురాలు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో ఈ దొంగ‌బాబా బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు అయింది.

త‌మ‌కు మంచి జ‌రుగుతుంద‌ని వ‌స్తున్న భ‌క్తుల‌ను, నమ్మినవారిని ప‌లువురు దొంగ‌బాబాలు నట్టేట ముంచుతున్నారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు వెలుగులోకి చూస్తూనే ఉన్నాయి.. జనం అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన ఒక దొంగ‌ బాబా బాగోతం తాజాగా ఏపీలో వెలుగులోకి వచ్చింది. సుంక‌ర ర‌జినీ అనే మ‌హిళ‌ విజయవాడలో నివాస‌ముంటున్నారు. అయితే, ఇటీవ‌ల ఆ మ‌హిళ మచిలీపట్నం, ఇనకుదురులో 14 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసింది.

అయితే, దానిని అమ్మ‌డానికి కొంత కాలంగా ప్ర‌య‌త్నాలు చేస్తోంది. కానీ అమ్ముడు పోవ‌డం లేదు. దీంతో 35 లక్షలతో కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో ఒక‌రిద్వారా బాబా గురించి తెలుసుకుంది. మౌలాల అనే దొంగ బాబాను రజనీకి ఓ భక్తురాలు పరిచయం చేయ‌డంతో.. త‌న స్థ‌లం గురించి ఆమె ఆ బాబాతో చెప్పుకుంది. ఈ క్ర‌మంలోనే ఆ బాబా స్థలం అమ్ముడు పోవాలంటే అక్క‌డ నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలని సూచించాడు.

అలాగే, ప్ర‌త్యేక పూజ‌లు చేయించాడు. దీని కోసం ఆ మ‌హిళ నుంచి రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు ఆ స్థ‌లంలో పాతి పెట్టాడు. అయితే, దొంగ‌బాబా మౌలాల మీద మ‌రింత నమ్మకం కుదిరేందుకు 100 గంజాలు అమ్ముడుపోయేలా చేశాడు. అయితే, ఆ స్థ‌లం అమ్మిన త‌ర్వాత త‌న‌కు నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడంతో అస‌లు విష‌యం తెలుసుకని,  బాబా మోసాన్ని గుర్తించిన బాధితురాలు రజనీ పోలీసులను ఆశ్రయించింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AP Minister Ramprasad Reddy Lays Foundation for ₹19 Crore Works in Vijayawada | Asianet News Telugu
APCPDCL హెడ్ఆఫీస్ప్రారంభంలోMinister Gottipati Ravi Kumar | APCPDCL Head Office | Asianet News Telugu