పశ్చిమ గోదావరి జిల్లాలో కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

Published : Mar 04, 2020, 07:51 AM ISTUpdated : Mar 04, 2020, 08:20 AM IST
పశ్చిమ గోదావరి జిల్లాలో  కాలువలోకి దూసుకెళ్లిన కారు: ముగ్గురు మృతి

సారాంశం

 పశ్చిమ గోదావరి జిల్లాలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు వంతెన  నుండి కాలువలోకి దూసుకెళ్లింది.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలో కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. వేగాన్ని అదుపు చేయలేకపోవడంతో కారు వంతెన  నుండి కాలువలోకి దూసుకెళ్లింది.

Also read:గుంటూరులో వాగులో పడ్డ వ్యాన్: ఆరుగురు మృతి, పలువురికి గాయాలు

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాథపురం వద్ద వంతెన నుండి బుధవారం నాడు ఉదయం  కారు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు.

రొయ్యల ఫీడ్ కొనుగోలు కోసం వెళ్తున్నాని చెప్పి కారులో ముగ్గురు బయలు దేరారు. బుధవారం నాడు ఉదయం ఈ ముగ్గురు ప్రయాణం చేస్తున్న కారు జగన్నాథపురం వంతెన నుండి కాలువలో పడింది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కారును కాలువలో నుండి బయటకు తీశారు. 

Also read:రాధిక కుటుంబం జల సమాధి: సీసీ కెమెరాల్లో కారు గుర్తింపు

కారులో ముగ్గురు మృతి చెందినట్టుగా గుర్తించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కాలువల్లోకి కారు బోల్తా పడిన ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చోటు చేసుకొంటున్నాయి. ఈ నెల 1వ తేదీన గుంటూరు జిల్లాలో వాగులో కారు బోల్తా పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు.

Also read:కరీంనగర్‌‌లో బ్రిడ్జిపై నుండి కారు బోల్తా: ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు

ఇటీవల కాలంలో కాలువల్లో కార్లు బోల్తా పడి మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే  ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో రెండు ఘటనలు వెలుగు చూశాయి. పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సోదరి రాధిక కుటుంబం జనవరి 27వ తేదీన కాకతీయ కాలువలో పడి మృతి చెందారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన తిమ్మాపూర్ మండలం అలుగునూరు వద్ద కారు బోల్తా పడిన ఘటనలో ఒక్కరు మృతి చెందారు.ఫిబ్రవరి 27వ తేదీన నల్గొండ జిల్లాలో మరో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.  ఈ ఘటనలు తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి.ఈ ఏడాది మార్చి 1న గుంటూరులో వాగులో వ్యాన్ బోల్తాపడి ఆరుగురు మృతి చెందారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్