జగన్ కన్నా కిరణ్ కుమార్ రెడ్డే బెటర్: చంద్రబాబు వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Mar 3, 2020, 6:40 PM IST
Highlights

కిరణ్‌కుమార్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. డీజీపీ ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 

కిరణ్‌కుమార్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి లేదన్నారు టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు. డీజీపీ ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. 151 నోటీసు ఇచ్చి తనను అడ్డుకోవడం ఏంటని చంద్రబాబు నిలదీశారు.

జగన్ అసమర్ధత వల్లే స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గాయని ఆయన విమర్శించారు. 33 ఏళ్ల నుంచి వున్న రిజర్వేషన్లను జగన్ కాపాడలేకపోయారని, బీసీసీలపై కక్షతోనే ఆయన ఇలా చేశారని టీడీపీ అధినేత మండిపడ్డారు. 

Also Read:జగన్‌కు షాక్: రిజర్వేషన్ కోటా జీవోను కొట్టేసిన హైకోర్టు

1987 స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 27 శాతం, 1995లో 34 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. రిజర్వేషన్ల పెంపు వల్లే అనేక బీసీ కులాలు రాజకీయంగా పైకి వచ్చాయని చంద్రబాబు తెలిపారు.

అమరావతిని నాశనం చేసేందుకు ఉద్దేశించిన కేసు కోసం ఢిల్లీ నుంచి ముకుల్ రోహత్గీని ప్రత్యేక విమానంలో తీసుకుచ్చారని ఆయన మండిపడ్డారు. 1994లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉంటుందని బాబు గుర్తుచేశారు.

బీసీ కమీషన్ ఇచ్చిన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సి ఉంటుందని, వైఎస్ హయాంలో 34 శాతం బీసీ రిజర్వేషన్‌తో ఎన్నికలు జరిగాయని బాబు తెలిపారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీలతో కలిపి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని జీవో తెచ్చారని అయితే అప్పట్లో హైకోర్టు దీనిని కొట్టేసిందన్నారు

Also Read:నెల రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు:జగన్

అయితే కిరణ్ రెడ్డి అఖిలపక్ష భేటీ తర్వాత సుప్రీంకోర్టులో దానిని ఛాలెంజ్ చేశారని, తిరిగి 2011లో జనాభా లెక్కల ఆధారంగానే స్థానిక ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తుచేశారు.

1995 నుంచి ఇప్పటి వరకు 34 శాతం రిజర్వేషన్లు కాపాడామన్నారు. వైసీపీ ప్రభుత్వం 50 శాతానికి పోతే బీసీలకు 24 శాతమే రిజర్వేషన్లు మిగులుతాయని.. ఇది జగన్ చేతికాని తనం కాదా... బీసీలపై ఉండే కక్ష కాదా.. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. 
 

click me!