సెలవు నిరాకరణ... రక్తస్రావం జరిగి గర్భిణీ టీచర్ మృతి

By telugu teamFirst Published May 13, 2019, 9:11 AM IST
Highlights

ఆమె నిండు గర్బిణి. టీచర్ గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా... ఆరోగ్యం సరిగాలేదని ఒక రోజు సెలవు అడగగా.. ఇవ్వలేదు. దీంతో... ఎండలోనే స్కూల్లో నిర్వహించిన శిక్షణలో పాల్గొంది. చివరకు రక్త స్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది. 

ఆమె నిండు గర్బిణి. టీచర్ గా విధులు నిర్వర్తిస్తోంది. కాగా... ఆరోగ్యం సరిగాలేదని ఒక రోజు సెలవు అడగగా.. ఇవ్వలేదు. దీంతో... ఎండలోనే స్కూల్లో నిర్వహించిన శిక్షణలో పాల్గొంది. చివరకు రక్త స్రావం జరిగి ప్రాణాలు కోల్పోయింది. 

ఈ విషాదకర సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  శ్రీచైతన్య విద్యాసంస్థ తమ ఉపాధ్యాయులకు నగర శివారులోని కట్టమంచి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం కోర్టు రోడ్డులోని శ్రీచైతన్య పాఠశాలలో ఉపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్న సుధారాణి (28) హాజరైంది.

ఆమె మూడు నెలల గర్భిణి. దీనికితోడు అనారోగ్యంగా ఉండడంతో తాను శిక్షణకు రాలేనని చెప్పినా నిర్వాహకులు వినలేదు. కచ్చితంగా హాజరుకావాలని చెప్పడంతో చేసేది లేక శిక్షణకు వచ్చారు. బుధవా రం రాత్రి ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నిర్వాహకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అబార్షన్‌ అయ్యి రక్తస్రావం ఎక్కువ కావడంతో ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న ప్రైవేటు టీచర్స్‌ అసోసియేషన్‌ నాయకులు శుక్రవారం శిక్షణ కేంద్రం ఎదుట ధర్నా చేపట్టారు.

బాధిత కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా... తన భార్య మృతికి న్యాయం చేయాలని సుధారాణి భర్త పోరాటం చేస్తున్నారు. న్యాయం చేయకుంటే తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని అతను బెదిరించడం గమనార్హం. కాగా.. సుధారాణికి 7ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రెండో సారి గర్భం దాల్చడంతో ఇలా జరిగి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

click me!