కృష్ణా తీరంలో మందు పార్టీ... మత్తులో ఈతకు దిగి ముగ్గురు మిత్రులు దుర్మరణం (వీడియో)

Published : Mar 04, 2023, 10:34 AM IST
కృష్ణా తీరంలో మందు పార్టీ... మత్తులో ఈతకు దిగి ముగ్గురు మిత్రులు దుర్మరణం (వీడియో)

సారాంశం

కొత్త కారు కొన్న ఆనందంలో కృష్ణా తీరంలో మందుపార్టీ చేసుకున్న ముగ్గురు స్నేహితుల ఈత సరదా ప్రాణాలమీదకు తెచ్చింది. నదిలో గల్లంతయి ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. 

విజయవాడ : కొత్త కారు కొన్న ఆనందంలో చేసుకున్న పార్టీ ముగ్గురు స్నేహితుల ప్రాణాలు తీసింది. కృష్ణా నది ఒడ్డున కారులోనే మందు పార్టీ చేసుకున్న స్నేహితులు ఆ మత్తులోనే నదిలో ఈతకు దిగి ప్రాణాలమీదకు తెచ్చుకున్నారు.ముగ్గురు స్నేహితులు నదిలో ఈతకు దిగి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇలా ఎంతో సంతోషంతో చేసుకున్న కొత్త కారు పార్టీ ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న దుర్ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు, బాధిత కుటుంబాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని అబ్దుల్ రహీం(34) ఓ రెస్టారెంట్ నడిపిస్తున్నాడు.అతడు కొత్తగా కారు కొనుక్కుని స్నేహితులకు పార్టీ ఇచ్చాడు.  తన కారులోనే స్నేహితులు షేక్ ఖలీషా(30), తాళ్లూరి కిరణ్(37) ను ఎక్కించుకుని మద్యం బాటిల్లు, ఫుడ్ తీసుకుని పార్టీ చేసుకోడానికి కృష్ణా నది తీరానికి వెళ్లాడు. ఇలా ముగ్గురు స్నేహితులు చోడవరం ఘాట్ లో కారును నిలిపి అందులోనే మద్యం సేవించారు. 

అయితే ఫుల్లుగా మందు తాగిన ముగ్గురు స్నేహితులు ఆ మత్తులోనే కృష్ణా నదిలో ఈతకు దిగారు.కానీ మద్యంమత్తులో ఈదడం సాధ్యంకాక నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యారు.రాత్రి సమయంలో ఈ ఘటన జరగడంతో వారిని కాపాడేవారు కూడా ఎవ్వరూ లేకుండాపోయారు.ఇలా కృష్ణా నదిలో మునిగి రహీం,ఖలీషా, కిరణ్ మృతిచెందారు. 

గత శుక్రవారం ఉదయం ఘాట్ లో ఖరీదైన కారు ఆగివుండటం... చుట్టుపక్కల ఎవ్వరూ లేకపోవడంతో అనుమానం వచ్చి స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారును తెరిచిచూడగా అందులో మద్యం బాటిల్స్, ఫుడ్ కనిపించింది. అనుమానంతో చుట్టుపక్కల చూడగా ఓ చోట చెప్పులు, బట్టలు కనిపించాయి. దీంతో నదిలోకి ఈతకు దిగి గల్లంతయ్యారని దృవీకరించి గాలింపు చేపట్టారు. 

వీడియో

గజ ఈతగాళ్ళు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కృష్ణా నదిలో గాలింపు చేపట్టి ముందుగా ఖలీషా,రహీం మృతదేహాలు బయటకు తీసారు.శుక్రవారం రాత్రివరకు గాలింపు చేపట్టినా కిరణ్ మృతదేహం లభించకపోవడంతతో ఇవాళ(శనివారం) కూడా కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. మృతుల కుటుంబసభ్యుల రోదనలతో కృష్ణా తీరంలో విషాద వాతావరణం నెలకొంది.కొత్త కారు కొన్న ఆనందం ఆవిరై ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. 

ఈ ఘటనప కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లభించిన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నదులు, నీటి ప్రవాహాల ఒడ్డున మందు పార్టీలు చేసుకోవద్దని... మత్తులో ఇలాగే ప్రమాదాలు సంభవించే అవకాశాలుంటాయని హెచ్చరిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?
IMD Rain Alert : ఈ రెండ్రోజులు వర్ష బీభత్సమే... ఈ ప్రాంతాలకు పొంచివున్న ప్రమాదం