కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రి: కాసేపట్లో కడప ఎంపీ తల్లి వైఎస్ శ్రీలక్ష్మి‌ డిశ్చార్జ్

By narsimha lode  |  First Published May 26, 2023, 10:25 AM IST

కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో  చికిత్స  పొందుతున్న వైఎస్ శ్రలక్ష్మిని  ఇవాళ డిశ్చార్జ్  చేయనున్నారు.  


కర్నూల్: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  తల్లి  వైఎస్ శ్రీలక్ష్మిని  శుక్రవారంనాడు  ఆసుపత్రి నుండి  డిశ్చార్జ్  చేయనున్నారు. ఈ  నెల  19వ తేదీ నుండి  విశ్వభారతి  ఆసుపత్రిలో   వైఎస్  శ్రీలక్ష్మి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం నాడు  ఉదయం వైఎస్ శ్రీలక్ష్మి ఆరోగ్య  పరిస్థితిపై   విశ్వభారతి  ఆసుపత్రి వైద్యులు  హెల్త్ బులెటిన్   విడుదల  చేశారు. వైఎస్ శ్రీలక్ష్మి   వైద్యం  మెరుగపడిందని వైద్యులు  ఆ బులెటిన్ లో  ప్రకటించారు. అయితే   వైఎస్ శ్రీలక్ష్మి కి  ఇంకా మెరుగైన వైద్యం  అందించాలని   వైద్యులు  అభిప్రాయపడ్డారు. మెగరుగైన వైద్య చికిత్స కోసం   హైద్రాబాద్ కు తరలించే అవకాశం లేకపోలేదు.

ఈ నెల  19వ తేదీన  వైఎస్ శ్రీలక్ష్మి  అస్వస్థతకు గురయ్యారు  పులివెందుల ఆసుపత్రిలో  ప్రాథమిక చికిత్స తర్వాత   మెరుగైన చికిత్స  కోసం  కర్నూల్ విశ్వభారతి  ఆసుపత్రిలో  చేర్పించారు. ఈ నెల  19న సీబీఐ విచారణకు  హాజరయ్యేందుకు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  హాజరయ్యేందుకు  వెళ్లే  సమయంలో  తల్లికి అనాగోగ్యం గురించి  సమాచారం  రావడంతో  వైఎస్ అవినాష్ రెడ్డి  సీబీఐ విచారణకు వెళ్లకుండా  పులివెందులకు  బయలుదేరారు. 

Latest Videos

undefined

అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలో  తల్లిని తరలిస్తున్న  వైఎస్ అవినాష్ రెడ్డికి ఎదురైంది.  అంబులెన్స్ లోనే  వైఎస్ అవినాష్ రెడ్డి  తాడిపత్రి నుండి కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రికి  చేరుకున్నారు.  కర్నూల్  విశ్వభారతి ఆసుపత్రిలోనే  వైఎస్ శ్రీలక్ష్మికి  చికిత్స అందిస్తున్నారు. ఇవాళ   శ్రీలక్ష్మి   ఆరోగ్యం మెరుగుపడినట్టుగా  కర్నూల్  విశ్వభారతి  వైద్యులు  హెల్త్ బులెటిన్  విడుదల  చేసింది. ఈ నెల  16, 19, 22,  తేదీల్లో  సీబీఐ విచారణకు  హాజరు కావాలని సీబీఐ  అధికారులు   వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు  ఇచ్చారు. అయితే  పలు  కారాణాలను చూపుతూ  సీబీఐ విచారణకు వైఎస్ అవినాష్ రెడ్డి  పేర్కొన్న విషయం తెలిసిందే. 

మరో వైపు  కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి  దాఖలు  చేసిన  ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ తెలంగాణ హైకోర్టులో  విచారణ  జరగనుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు  తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్   ఈ పిటిషన్ పై విచారణ  నిర్వహిస్తుంది. 

click me!