చిత్తూరులో విషాదం: క్వారీ గుంతలో ముగ్గురి మృతదేహలు

Published : May 25, 2021, 11:08 AM IST
చిత్తూరులో విషాదం: క్వారీ గుంతలో ముగ్గురి మృతదేహలు

సారాంశం

చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి. రామాపురంలోని క్వారీ గుంతలో మూడు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి.

చిత్తూరు:చిత్తూరు జిల్లాలోని రామచంద్రాపురం మండలం సి. రామాపురంలోని క్వారీ గుంతలో మూడు మృతదేహాలు కలకలం సృష్టిస్తున్నాయి. రామాపురంలోని అన్నాస్వామి గండి చెరువు క్వారీ గుంతలో మూడు మృతదేహలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

క్వారీ గుంతలో ఉన్న మృతదేహాలను  నీరజ, చందు, చైత్రలుగా గుర్తించారు. ఈ ప్రాంతానికి సమీపంలోనే కంపోస్టు యార్డులో  స్కూటీని పోలీసులు గుర్తించారు. ఏపీ 03 cసీఎఫ్ 3501 అక్టివా స్కూటీగా పోలీసులు  గుర్తించారు. మృతురాలు స్విమ్స్ లో నర్సుగా పనిచేస్తోంది. మృతులు జిల్లాలోని పెనుమూరు మండలం గుండ్యాలపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు.  ప్రమాదవశాత్తు ఈ ముగ్గురు మరణించారా లేక ఎవరైనా హత్య చేసి మృతదేహలను క్వారీలో వేశారా అనే విషయమై పోలీసులు  ఆరా తీస్తున్నారు బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముగ్గురు ఎందుకు మృతికి గల కారణాలపై పోలీసులు కుటుంబసభ్యులతో పాటు స్థానికులను  ఆరా తీస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!
Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్