ఘోరం... హాస్పిటల్ భవనం పైనుండి దూకి కరోనా రోగి ఆత్మహత్య (వీడియో)

Arun Kumar P   | Asianet News
Published : May 25, 2021, 10:54 AM ISTUpdated : May 25, 2021, 12:03 PM IST
ఘోరం... హాస్పిటల్ భవనం పైనుండి దూకి కరోనా రోగి ఆత్మహత్య (వీడియో)

సారాంశం

హాస్పిటల్ లో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి హాస్పిటల్ మూడవ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ విషాద సంఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. 

కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని పిన్నమనేని సిద్దార్ధ కోవిడ్ హాస్పిటల్ లో విషాదం చోటుచేసుకుంది. ఈ హాస్పిటల్ లో కరోనాతో చికిత్స పొందుతున్న ఓ వ్యక్తి హాస్పిటల్ మూడవ అంతస్తు పై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఉంగుటూరు మండలం తేలప్రోలు శివారు కొత్తూరుకు చెందిన పోలిబోయిన రోశయ్య(49)గా పోలీసులు గుర్తించారు.

గ్రామానికి చెందిన రోశయ్య వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈక్రమంలో ఈ నెల 16న కరోనా వైరస్ సోకి పిన్నమనేని హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నాడు. అయితే హాస్పిటల్ లో చేరి వారం రోజులు దాటినప్పటికి కరోనా వైరస్ తగ్గకపోవడంతో మనస్తాపానికి గురైన రోశయ్య చికిత్స ఘోర నిర్ణయం తీసుకున్నాడు. చికిత్స పొందుతున్న హాస్పిటల్ మూడవ అంతస్తు కిటికీలో నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

వీడియో

ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న ఆత్కూరు ఎస్సై జి.శ్రీనివాసరావు సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రోశయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

read more  ఏపీలో కరోనా కట్టడికి... జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత 24 గంటల్లో కొత్తగా 12,994 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు 96 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 15లక్షల93 వేల 821కి చేరుకొన్నాయి. నిన్నటితో పోలిస్తే కరోనా కేసులు తగ్గాయి.గత 24 గంటల్లో అనంతపురంలో 1047, చిత్తూరులో 1600, తూర్పుగోదావరిలో2652, గుంటూరులో670, కడపలో874 కృష్ణాలో274, కర్నూల్ లో856, నెల్లూరులో 503, ప్రకాశంలో 703, శ్రీకాకుళంలో 864, విశాఖపట్టణం1690 ,విజయనగరంలో 535, పశ్చిమగోదావరిలో 746 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో96 మంది కరోనాతో మరణించారు.చిత్తూరులో 14 మంది, కర్నూల్, విజయనగరం జిల్లాల్లో 10 మంది చొప్పున చనిపోయారు. అనంతపురంలో 9మంది, తూర్పుగోదావరి,విశాఖపట్టణం జిల్లాల్లో  8 మంది చొప్పున కరోనాతో మరణించారు.గుంటూరు,కృష్ణా, నెల్లూరు,శ్రీకాకుళం జిల్లాల్లో ఏడుగురు చొప్పున చనిపోయారు. పశ్చిమగోదావరిలో నలుగురు., ప్రకాశంలో ముగ్గురు, కడపలో ఇద్దరు కరోనాతో మృత్యువాత పడ్డారు.  రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 10,222కి చేరుకొంది. 

గత 24 గంటల్లో కరోనా నుండి 18,373 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,79,637 మంది కరోనా నుండి కోలుకొన్నారు.రాష్ట్రంలో గత 24 గంటల్లో 58,835 మందికి పరీక్షలు నిర్వహిస్తే 12,994 మందికి కరోనాగా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,86,76,222 మంది శాంపిల్స్ పరీక్షించారు. 

ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,29,741, మరణాలు 851
చిత్తూరు-1,76,630, మరణాలు 1195
తూర్పుగోదావరి-208508, మరణాలు 911
గుంటూరు -1,43,700, మరణాలు 905
కడప -90,410, మరణాలు 534
కృష్ణా -83,697, మరణాలు 930
కర్నూల్ -1,08,834, మరణాలు 689
నెల్లూరు -1,12,288, మరణాలు 768
ప్రకాశం -1,01,085, మరణాలు  751
శ్రీకాకుళం-1,03,690, మరణాలు 531
విశాఖపట్టణం -1,28,344 మరణాలు 874
విజయనగరం -71,012, మరణాలు 508
పశ్చిమగోదావరి-1,32,987, మరణాలు 775


 


  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే