మూడు రోజుల పసికందు కిడ్నాప్.. గుంటూరు హాస్పిటల్‌లో ఘటన

Published : Oct 16, 2021, 12:45 PM ISTUpdated : Oct 16, 2021, 12:47 PM IST
మూడు రోజుల పసికందు కిడ్నాప్.. గుంటూరు హాస్పిటల్‌లో ఘటన

సారాంశం

గుంటూరు జిల్లాలో మూడు రోజుల పసికందును కొందరు దుండగులు అపహరించారు. ఈ నెల 12న జన్మించిన మగ శిశువును వార్డు బయటకు తీసుకువచ్చి నిద్రబుచ్చి అమ్మమ్మ, నానమ్మలూ పడుకున్నారు. అప్పుడే ఆ బాలుడిని కిడ్నాప్ చేశారు. పోలీసులకు రంగంలోకి దిగారు. ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. Guntur జిల్లాలోని ప్రభుత్వ hospital నుంచి మూడు రోజుల పసికందును దుండగులు kidnap చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి ఈ ఘటన జరిగింది.

గుంటూరు సమీపంలోని పెదకాకానికి చెందిన ప్రియాంక ఈ నెల 12న జీజీహెచ్ ఆస్పత్రిలో ప్రసవించారు. ప్రియాంకకు బాలుడు జన్మించాడు. ఆ శిశువును తాత, అమ్మమ్మలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 15వ తేదీ అర్ధరాత్రి దాటాక సుమారు 1.30 గంటల ప్రాంతంలో బాబును వార్డు బయటకు తీసుకువచ్చారు. అక్కడే కాసేపు ఆడించారు. అనంతరం బాబును పక్కనే ఉంచుకుని నిద్రపోయారు.

Also Read: గుంటూరు వాసులకు శుభవార్త: రూ.130 కోట్లతో పీవీకే నాయుడు కాంప్లెక్స్.. మంత్రి బొత్స ఆమోదం

ఇదే అదనుగా కొందరు దుండగులు తమ పథకం అమలు చేశారు. ఆ వృద్ధుల పక్కనే పడుకున్న శిశువును గుట్టుచప్పుడు కాకుండా ఎత్తుకెళ్లినట్టు అనుమానిస్తున్నారు. కాసేపటికి మెలకువకు వచ్చిన ఆ ముసలివాళ్లు పక్కన బాబు లేకపోవడంతో హతాశయులయ్యారు. వెంటనే జీజీహెచ్ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఓ ఇద్దరు అనుమానితులను గుర్తించారు. ప్రస్తుతం ఆ ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు. శిశువు అదృశ్యంతో పెదకాకానికి చెందిన తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

మాస్క్ అడిగితె చంపేస్తారా? Varla Ramaiah Serious Comments on YS Jagan | Viral | Asianet News Telugu
Huge Job Scam: సీఎంపీషీ పేరుతో భారీ మోసం.. రూ.12 లక్షలు దోచుకున్న ముఠా అరెస్ట్ | Asianet News Telugu