దేవరగట్టు బన్ని ఉత్సవంలో చెలరేగిన హింస : వందమందికి పైగా గాయాలు

Published : Oct 16, 2021, 08:08 AM ISTUpdated : Oct 16, 2021, 08:15 AM IST
దేవరగట్టు బన్ని ఉత్సవంలో చెలరేగిన హింస : వందమందికి పైగా గాయాలు

సారాంశం

ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. 

హోళగుంద : కర్నూలు జిల్లాలోని హొళగుంద మండలం దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని జైత్రయాత్ర శుక్రవారంం అర్థరాత్రి ప్రారంభమయ్యింది. ఉత్సవంలో చెలరేగిన హింసలో సుమారు వందమందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. 

క్షతగాత్రులను ఆదోనిలోని ఆసుపత్రికి తరలించారు. devaragattuలో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండమీద మాళ మల్లేశ్వరస్వామి దసరా banni utsavamనికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఉత్సవాల సందర్భంగా స్వామి మూర్తులను దక్కించుకోవడానిక నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఓ వైపు, అరికెర, అరికెర తండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు. 

శుక్రవారంనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సాయంత్రం వేళ ప్రజలు జమ్మి ఆకు పరస్పరం ఇచ్చిపుచ్చుకుని ప్రేమానురాగాలను పంచుకున్నారు.

కాగా, శుక్రవారం తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో dussehra ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ రోజు ప్రజలంతా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పించి పండుగని జరుపుకున్నారు. 

kurnool జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు ప్రాంతంలో దసరా రోజు కర్రల యుద్ధం ఉత్సవాలు జరిగాయి. ఇందులో తలలు పగలగొట్టుకుని మరి యుద్ధం చేస్తారు. మాల మల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాల్లో ప్రతి ఏడాది ఈ యుద్ధం ఆచారంగా జరుగుతుంది.
 
ఇక ఈ యేడు కూడా ఈ ఉత్సవం జరిగింది. ఈ యుద్ధంపై స్థానికులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే హింస జరిగింది. ఇటువంటి ఘోరమైన యుద్ధంలో తలలు పగులుతాయని అంతకుముందే మానవ హక్కుల కమిషన్ బాగా సీరియస్ అయ్యాయి. అంతేకాకుండా కర్నూలు కలెక్టర్, ఎస్పీలకు కూడా నోటీసులు జారీ చేశారు.

ఇంత హింస జరిగినా కూడా పోలీసులు ఆపలేకపోతున్నారని వారిపై ఆగ్రహం చేస్తున్నారు మానవ హక్కుల కమిషన్. దీంతో ఈ బన్నీ ఉత్సవంలో పాల్గొనే 22 గ్రామాల్లో పోలీసులు కొన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవంలో పాల్గొని భక్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నాలు చేశారు.

విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో లైట్ల ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఈ ఉత్సవం దసరా, ఆ తెల్లవారి రెండు రోజులు వరకు జరగనుండగా అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇక ఇలా చేయడానికి కారణం ఏంటంటే..

దేవరగట్టులో ఉత్కంఠ.. కర్రల సమరం, బన్నీ ఉత్సవానికి సర్వం సిద్ధం!

వందేళ్ళ కిందట దేవరగట్టులో వెలసిన మాల మల్లేశ్వర స్వామి కళ్యాణం తర్వాత విగ్రహాలను సొంతం చేసుకునేందుకు ఆ ప్రాంత పరిసరాల్లో ఉన్న 12 గ్రామాల ప్రజలు రెండు విభాగాలుగా విడిపోతారు. ఇక ఈ రెండు వర్గాల మధ్య జరిగే ఉత్సవమే కర్రల యుద్ధం.

ఇందులో పాల్గొనే ప్రజలు కర్రలకు ఇనుప చువ్వను బిగించి ఉత్సవంలో పాల్గొంటారు. కొన్ని కొన్ని సార్లు ఇందులో హింసలు కూడా జరిగే అవకాశం ఉంది. కానీ ఈ ఉత్సవాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారని ఇది తమ ఆచారమని తెలుస్తుంది.

ఇక ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలకు పైగా జనం తరలి వస్తారు. ఈ నేపథ్యంలో ఇంతమంది ప్రజల మధ్య ఎటువంటి దాడులు జరగబోతుందో అని ముందుగానే పలు ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా విద్యుత్, వైద్యశాఖ, ఫైర్ సిబ్బందిలను కూడా ఏర్పాటు చేశారు.

PREV
click me!

Recommended Stories

ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu