చంద్రబాబు రాజీనామా చేద్దామన్నా..‘ఆ’ మంత్రి ఒప్పుకోలేదట

First Published Feb 15, 2018, 12:20 PM IST
Highlights
  • రాష్ట్రప్రయోజనాలు, ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని చంద్రబాబునాయుడు అనుకున్నా కొందరు నేతలు అడ్డుతగిలారా?

రాష్ట్రప్రయోజనాలు, ప్రత్యేకహోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచుదామని చంద్రబాబునాయుడు అనుకున్నా కొందరు నేతలు అడ్డుతగిలారా? టిడిపిలోని విశ్వసనీయవర్గాలు అవుననే అంటున్నాయి. బడ్జెట్ సమావేశాలకు ముందే ప్రధానమంత్రి నరేంద్రమోడి-చంద్రబాబు భేటీ జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలు తదితరాలతో కూడిన 17 పేజీల నోట్ ను మోడికి చంద్రబాబు ఇచ్చారు. అయితే, మోడి పెద్దగా స్పందిచలేదని సమాచారం.

ఆరోజే చంద్రబాబుకు అర్ధమైపోయింది బడ్జెట్లో ఏముండబోతోందో. తర్వాత అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్, ప్రధానమంత్రి ప్రసంగం తదితరాల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర వైఖరేమిటో చంద్రబాబుకు స్పష్టంగా అర్ధమైపోయిందట. అందుకనే కేంద్రమంత్రులను వెంటనే రాజీనామా చేయాలని కేంద్రంలోని తనకు బాగా సన్నిహితంగా ఉండే మంత్రితో చంద్రబాబు చెప్పారట.

అయితే, అందుకు ఆమంత్రి అంగీకరించలేదట. కేంద్రమంత్రులుగా రాజీనామాలు చేసినంత మాత్రానా ఉపయోగమేమీ ఉండదని చంద్రబాబుకు తెగేసి చెప్పారట. బడ్జెట్ సమావేశాలు అయిపోయేంతవరకూ వేచి చూద్దామని అవసరాన్ని బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పారట. దాంతో చంద్రబాబు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారట. ఇంతలో రాజకీయంగా రాష్ట్రంలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అదే సమయంలో వైసిపి ఎంపిల రాజీనామా గురించి ప్రకటించటంతో టిడిపి ఇపుడు గింజుకుంటోంది.

click me!