ఢిల్లీకి త్వరలో జగన్

Published : Feb 15, 2018, 09:45 AM ISTUpdated : Mar 25, 2018, 11:56 PM IST
ఢిల్లీకి త్వరలో జగన్

సారాంశం

పార్టీ తరపున అంత భారీ ఎత్తున నిరసన, ఆందోళన చేసే సమయంలో పార్టీ అధ్యక్షుడు లేకపోతే బాగుండదని నేతలు అనుకున్నారట.

వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి త్వరలో డిల్లీకి వెళుతున్నారు. మార్చి 5వ తేదీన ఢిల్లీ వేదికగా వైసిపి ఎంపిలు, ఎంఎల్ఏలు, నేతలు భారీ ధర్నా చేస్తారని జగన్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే.  పార్టీ నేతలు, శ్రేణులు మాత్రం ఢిల్లీకి వెళ్ళి ధర్నాలో పాల్గొనేట్లు, జగన్ యధావిధిగా పాదయాత్ర కంటిన్యూ చేసేట్లుగా ముందు నిర్ణయమైంది. అయితే తర్వాత నేతల ఆలోచనలో మార్పు వచ్చిందట.

పార్టీ తరపున అంత భారీ ఎత్తున నిరసన, ఆందోళన చేసే సమయంలో పార్టీ అధ్యక్షుడు లేకపోతే బాగుండదని నేతలు అనుకున్నారట. అందుకనే ఎంపిలు మాట్లాడుతూ మార్చి 5వ తేదీకి జగన్ ను కూడా ఢిల్లీకి రావాల్సిందేనంటూ పట్టుపట్టారట. దాంతో జగన్ కూడా సుముఖంగానే ఉన్నారట. ఆరోజు పాదయాత్రకు బ్రేక ఇచ్చి ఢిల్లీకి రావాలంటూ నేతలు కూడా జగన్ తో గట్టిగా చెబుతున్నారట. జంతర్ మంతర్ లో ఆందోళన చేయాలని తొలుత అనుకున్న వేదిక మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

Weather Report: ఇక కాస్కోండి.. ఒక్క‌సారిగా మారుతోన్న వాతావ‌ర‌ణం.
YS Jagan Comments: అలా చేయడం బాబుకే సాధ్యం జగన్ కీలక కామెన్స్ కామెంట్స్| Asianet News Telugu