Tirumala Venkateswara Swamy: తిరుమలలో కలియుగ వైకుంఠ దైవమైన తిరుమలేషుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజున తిరుమల శ్రీనివాసుడు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక రాత్రికి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ వర్గాలు తెలిపాయి.
Tirumala navaratri brahmotsavams: తిరుమలలో కలియుగ వైకుంఠ దైవమైన తిరుమల వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవ రోజున తిరుమల శ్రీనివాసుడు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఇక రాత్రికి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి ముత్యపు పందిరి వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారని టీటీడీ వర్గాలు తెలిపాయి.
వివరాల్లోకెళ్తే.. తిరుమల వేంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రస్తుతం అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం మూడోరోజు ఉత్సవాలు జరగడంతో వేంకటేశ్వర స్వామికి సింహవాహన సేవ నిర్వహించారు. వాహన సేవలో స్వామివారి వైభవాన్ని తిలకించి భక్తులు ఆనందించారు. తిరుమల శ్రీనివాసుడు సింహ వాహనంపై భక్తులకు దర్శనమివ్వగా, సాయంత్రం 7గంటలకు శ్రీవేంకటేశ్వర స్వామివారికి మిథ్యాపు పందిరి వాహన సేవ నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు - సింహ వాహనం pic.twitter.com/KAAT5ZCyuo
— SVBCTTD (@svbcttd)
undefined
కాగా, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు (మంగళవారం) అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దివ్య స్వరూపాన్ని ధరించి దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నపూర్ణాదేవిని సర్వప్రాణులకూ ఆవశ్యకమైన అన్నం ప్రసాదించే దేవతగా పేరుగాంచినందున, అన్నపూర్ణాదేవిని అక్షయభూమిగా అలంకరించి సేవిస్తే అన్నపానీయాల కొరత ఉండదని ప్రజలు విశ్వాసం. అన్నపూర్ణా దేవి తన ఎడమ చేతిలో బంగారు పాత్రలో వజ్రాలు పొదిగిన అమృతన్న గరిటెని పట్టుకుని ఉండగా, ఇది తన భర్త ఈశ్వరునికి ఆహారం అందించే ఆమె చర్యకు ప్రతీకగా హిందువులు భావిస్తారు.
అన్నదానం లేదా ఆహారాన్ని అందించడం అనేది ఇతర అన్ని రకాల దానధర్మాల కంటే ఉన్నతమైనదిగా హిందూ పురాణాలు పేర్కొంటాయి. దసరా ఉత్సవాల్లో అన్నపూర్ణాదేవిని నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో దర్శించుకోవడం వల్ల అందరికీ ఆహారం, నీరు సమృద్ధిగా లభిస్తాయని భక్తుల నమ్మకం. ఈ రోజు కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారని సంబంధిత అధికారులు భావిస్తున్నారు.