గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కులాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాలో కాపులు, కమ్మలు పదిశాతం కూడా లేరన్నారు.
గురజాల : ఆంధ్రప్రదేశ్ లోని గురజాల వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనాభాలో కమ్మ, కాపులు పదిశాతం కూడా లేరన్నారు. అయినా, ఎప్పుడూ వారికే పదవులా? అంటూ ప్రశ్నించారు. కేవలం పది శాతం మాత్రమే ఉన్న కులాలను చూసి కాదు.. అభివృద్ధిని చూసి ఓటేయ్యండి.. అని తెలిపారు. కులంతో అభివృద్ధి ఉండదని, కష్టపడి చదువుకుంటే మంచి ఉద్యోగాలు సాధించుకోవచ్చని.. ఆర్థికంగా నిలబడొచ్చని.. దీనికి కులం అడ్డురాదని తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.