ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసు: చంద్ర‌బాబు పిటిషన్ల‌పై సుప్రీం, ఏపీ హైకోర్టు విచారణ

By Mahesh Rajamoni  |  First Published Oct 17, 2023, 10:38 AM IST

AP Skill Development Case: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో మంగ‌ళ‌వారం కీలక విచారణ జరగనుంది. కాగా, రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర పోలీసు నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవ‌డం మంచిదికాద‌నీ, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆరోపణల తీవ్రతను, దర్యాప్తు ఆవశ్యకతను కోర్టుముందు ఎత్తిచూపింది.
 


Chandrababu Naidu: తెలుగు దేశం పార్టీ (టీడీపీ) అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో మంగ‌ళ‌వారం కీలక విచారణ జరగనుంది. కాగా, రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి క్రిమినల్ ప్రొసీడింగ్‌లను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రాష్ట్ర పోలీసు నేర దర్యాప్తు విభాగం (సీఐడీ) ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవ‌డం మంచిదికాద‌నీ, ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ఆరోపణల తీవ్రతను, దర్యాప్తు ఆవశ్యకతను కోర్టుముందు ఎత్తిచూపింది.

ఈ క్ర‌మంలోనే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు , ఆంధ్రప్రదేశ్ హైకోర్టుల్లో కీలక విచారణ జరగనుంది.  ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై కీలక వాదనలు చేసేందుకు ఏపీ హైకోర్టు సిద్ధమైంది. గతంలో ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేయడంతో ఆయన లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు. హెల్త్ రిపోర్టు కోరుతూ చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఏసీబీ కోర్టు విచారించనుంది.

Latest Videos

అంతేకాకుండా చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తుది విచారణ చేపట్టాల్సి ఉంది. అంతేకాకుండా, ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనుంది. అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్‌మెంట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.

click me!