ఏపీలో మూడో దశ పంచాయతీ ఎన్నికలు..!

By telugu news teamFirst Published Feb 17, 2021, 9:06 AM IST
Highlights


 కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. అదే విధంగా 3,127 పోలింగ్‌ కేంద్రాలను అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. మరో 4,118 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ 7,245 కేంద్రాలలో పోలింగ్‌ ప్రక్రియను ఎన్నికల అధికారులు వెబ్‌ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు.

 కరోనా నేపథ్యంలో పూర్తి జాగ్రత్తలు తీసుకుని పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మాస్క్‌లు ధరిచేస్తే పోలింగ్‌ కేంద్రంలోకి ఓటర్లను అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగుతుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 160 మండలాల పరిధిలోని 26,851 పోలింగ్‌ కేంద్రాలలో మూడో విడత పోలింగ్‌ ఉదయం 6.30 గంటలకే మొదలైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ కొనసాగనుంది. ఆయా గ్రామ పంచాయతీల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగిసిన వెంటనే అర గంట వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపడతారు.
 

click me!