గోదావరికి తగ్గిన వరద: ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ

By narsimha lode  |  First Published Jul 19, 2022, 5:35 PM IST

గోదావరి నదికి వరద ఉధృతి తగ్గింది. దీంతో ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. గోదావరికి  వరదలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. 


రాజమండ్రి: Godavari కి వరద ఉధృతి తగ్గింది. దీంతో Dowleswaram వద్ద గోదావరి కి ఇవాళ 19.73 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగానే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. 

ధవళేశ్వరం వద్ద  17 లక్షల క్యూసెక్కులకు వరద నీరు చేరితే  మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.  ఇవాళ మధ్యాహ్నం ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉప సంహరించారు. మధ్యాహ్నం గోదావరికి వరద తగ్గడంతో మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు.

Latest Videos

గోదావరికి వరద తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. గోదావరి నదికి 100 ఏళ్లలో రాని వరద ఈ ఏడాది జూలై మాసంలో వచ్చిందని అధికారులు చెబుతున్నారు. 1986 లో కంటే పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి పోటెత్తిందని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

 Bhadrachalam  వద్ద గోదావరికి వరద ఉధృతి తగ్గింది. దీంతో ధవళేశ్వరం వద్ద కూడా వరద ఉధృతి తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.  అయితే  వరద ఉధృతి తగ్గడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరికి వచ్చే వరదను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

గోదావరి పరివాహక ప్రాంతంలోని సుమారు 550కి గ్రామాల ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు. వరద ముంపు తగ్గిన తర్వాత పునరావాస కేంద్రాల నుండి ప్రజలు తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. వరద తెచ్చిన బురదను ముంపు గ్రామాల ప్రజలు శుభ్రం చేసుకుంటున్నారు.

also read:శ్రీశైలం ప్రాజెక్టు‌లోకి భారీగా వరద నీరు.. మూడు రోజుల్లో గేట్లు ఎత్తే చాన్స్..!

గోదావరి నదికి గతంలో ఏన్నడూ లేని రీతిలో వరద రావడంతో యానాంలోకి కూడా వరద పోటెత్తింది. 1986 తర్వాత ఇంత స్థాయిలో వరదను తాముచూడలేదని  యానాం వాసులు చెబుతున్నారు. యానాం పట్టణంలో వరద పోటెత్తడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ధవళేశ్వరం నుండి  సముద్రంలోకి గోదావరి కలిసే ప్రాంతంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వద్ద గోదావరి ఉధృతికి  రివర్ బండ్ కోతకు గురౌతుంది.

గోదావరి ముంపు గ్రామాల్లో సహాయక చర్యల కోసం  మొత్తం  10 NDRF,  11 SDRF బృందాలు పనిచేస్తున్నాయి. ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులతో పాటు ఇతర అత్యవసర సరుకులను పడవల ద్వారా అందిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో వరద నీరు పూర్తిగా తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

click me!