గుంటూరు జిల్లా మేడికొండూరులో అచ్చు సినీ పక్కీలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చి, మహిళను కత్తులతో బెదిరించి నగలు ఎత్తుకుపోయారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

మేడి కొండూరుకు చెందిన వెంకటరమణారావు గురువారం తెల్లవారు జామున పాల ప్యాకెట్ తీసుకొచ్చేందుకు బజారుకు వెళ్లాడు. ఇది గుర్తించిన దుండగులు తమను గుర్తు పట్టకుండా తలకు టోపి, ముఖానికి గుడ్డలు కట్టుకుని ఇంట్లోకి ప్రవేశించారు.
ఒంటరిగా ఉన్న వెంటరమణారావు భార్య విజయలక్ష్మిని పట్టుకుని మాట్లాడితే చంపుతామని కత్తులతో బెదిరించారు.ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగరం, మెడలో ఉన్న మంగళసూత్రం, చెవి దిద్దులు లాక్కున్నారు.
బీరువాలో ఉన్న రూ. 900లు తీసుకుని పరారయ్యారు. బాధితులు ఫిర్యాదు మేరకు ఎస్ఐ నరహరి తన సిబ్బందితో అక్కడకు చేరుకుని వివరాలు సేకరించారు. వేలి ముద్రల నిపుణులు చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మొత్తం రూ. 16000 విలువ గల వస్తువుల చోరీ జరిగిందని గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.