
రేపు ఉదయం 11.30 గంటలకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కలవనున్నారు. పంచాయతీ ఎన్నికలు హైకోర్టు తీర్పును ఆయన గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల ప్రక్రియ నిలిపివేసేలా గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్న నేపథ్యంలో గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ కాబోతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read;‘ పంచాయతీ ’ రగడ: హైకోర్టు తీర్పుపై సుప్రీంలో ఏపీ సర్కార్ పిటిషన్
మరోవైపు హైకోర్టు తీర్పుతో పంచాయితీ ఎన్నికలకు సిద్ధమవుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చినట్లేనని ఎస్ఈసీ అంటోంది. ఎల్లుండి నుంచి నాలుగు విడతల్లో పంచాయితీ ఎన్నికలకు నోటిఫికేషన్‌లు విడుదల కానున్నాయి.
ఈ నెల 23, తొలిదశ ఎన్నిలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 27న రెండో దశ, ఈ నెల 31న మూడో దశ, ఫిబ్రవరి 4న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది.
మరోవైపు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చంటూ హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతుండటంతో ఎన్నికలను వాయిదా వేయాలని సర్కార్ తన పిటిషన్‌లో పేర్కొంది.