ఆంధ్రా వాళ్లకు శుభవార్త

First Published Sep 13, 2017, 6:13 PM IST
Highlights

 విద్యుత్  వినియోగం భారం కాకుండా చూస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు

 ఆంధ్రా వాళ్లకు శుభవార్త.

 పరిశ్రమల నుంచి గృహ విద్యుత్ వరకు వినియోగదారులెవరి మీద  చార్జీల భారం మోపే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  స్పష్టం చేశారు.  

దీన్నినమ్మాలో లేదో చెప్పలేం గాని, ఈ విషయాన్ని ఆయన అధికారులతో జరిపిన  ఒక సమావేశంలో చాలా గట్టిగా చెప్పారు. చార్జీల పెంపు గురించి ఆలోచించకుండా మరింత చవకైన విద్యుత్‌పై దృష్టి పెట్టాలని, అలాగే వ్యయ భారం తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు.

 ఒపినియన్స్ మార్చక పోతే, పొలిటిషిషనెలా అవుతారు. అందువల్ల ఈ నిర్ణయం మారదన్న గ్యారంటీ లేదు. అంతదాకా శుభవార్తే...

 థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, కొనుగోలు క్రమంగా నిలిపివేయాలని సూచించారు. సౌర-పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఉత్పత్తి పెద్దఎత్తున జరిగేలా చూడాలని, రాష్ట్రంలో విద్యుత్ నిల్వ సామర్ధ్య వ్యవస్థ నెలకొల్పడం ద్వారా వ్యయభారం గణనీయంగా తగ్గించుకోవచ్చని ముఖ్యమంత్రి చెప్పారు. సౌర, పవన విద్యుత్ లోటు వున్నప్పుడు ప్రత్యామ్నాయంగా గ్యాస్ ఆధారిత విద్యుత్‌ను వినియోగించుకోవాలని అన్నారు. 

బుధవారం తన కార్యాలయంలో విద్యుత్ రంగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించగా, 2016-17 ఆర్ధిక సంవత్సరంలో ఏపీడిస్కంకు ఆదాయం కన్నా వ్యయం అధికంగా వుందని అధికారులు వివరించారు. ఆదాయం రూ. 25,290 కోట్లు రాగా, రూ. 27,621 కోట్ల వ్యయమైందని మొత్తంమీద రూ. 2,331 కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపారు. గోవా, పంజాబ్, బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు 1,089 మిలియన్ యూనిట్ల విద్యుత్ విక్రయం ద్వారా రూ. 173 కోట్ల ఆదాయం అదనంగా ఆర్జించేందుకు అవకాశం వుందని చెప్పారు.

click me!