
‘‘వైసీపీ ఎంఎల్ఏలు టిడిపిలో చేరేందుకు ఉబలాటపడుతున్నారు..అందుకే తమతో టచ్ లో ఉన్నారు’’...నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు. జగన్ తీరుతో విసిగిపోయిన పలువురు ఎంఎల్ఏలు తమ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ముగ్గురు ఎంఎల్ఏలు మాత్రం వైసీపీ నుండి ఎప్పుడెప్పుడు బయటకు వచ్చేసి టిడిపిలో చేరుదామా అని బాగా తొందరపడుతున్నట్టు లోకేష్ చెప్పటం ఆశ్చర్యంగా ఉంది. అంటే ఫిరియంపుల సినిమా ఇంకా అయిపోలేదని చెప్పటమేనా లోకేష్ ఉద్దేశ్యం. నైతికతను వదిలేసిన చంద్రబాబునాయుడు యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే చంద్రబాబు పుత్రరత్నం మాత్రం అందుకు భిన్నంగా ఎలా మాట్లాడుతారు?
ఫిరాయింపులపై తెలంగాణాలో తాను మాట్లాడిన మాటలను చంద్రబాబు మరచిపోయినట్లున్నారు. అందుకే నిసిగ్గుగా ఏపిలో రాజకీయ వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారు. లోకేష్ కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరికి టిక్కెట్లు ఇచ్చేది లేనిదీ అప్పుడు చూసుకోవచ్చన్నట్లుంది వీరి వ్యవహారం. ఎందుకంటే ఒకసారంటూ టిడిపిలోకి ఫిరాయించిన తర్వాత 2019లో ఫిరాయింపుల్లో టిక్కెట్లు దక్కకున్నా వారు చేయగలిగేది ఏమీ లేదన్నదే చంద్రబాబు, లోకేష్ ధీమాగా కనబడుతోంది.