Cyclone Michaung : ఏపీలో తుఫాను భీభత్సం... రైతుల పరిస్థితి మరీ దయనీయం... సీఎం జగన్ భరోసా   

By Arun Kumar PFirst Published Dec 6, 2023, 2:36 PM IST
Highlights

మిచౌంగ్ తుఫాను కాారణంగా నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భరోసా ఇచ్చాారు. ఆంధ్ర ప్రదేశ్ లో వర్షం, ఈదురుగాలులు భీభత్సం సృష్టించిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశించారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో మిచౌంగ్ తుఫాను భీభత్సం సృష్టించింది. ఈ  తుఫాను ప్రభావంతో కురిసిన అత్యంత భారీ వర్షాలు, వీచిన ప్రచండ గాలులకు తీవ్ర పంటనష్టం జరిగింది. కొన్నిచోట్ల ఈదురుగాలుల దాటికి ప్రమాధాలు సంభవించి మనుషులతో పాటు మూగజీవాలు ప్రాణాలు కోల్పోయి. ఇక భారీ వర్షాల ధాగికి వాగులువంకలు పొంగిపొర్లుతూ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. 

తీరం దాటిన మిచౌంగ్ కాస్త బలహీనపడి వర్షాలు తగ్గాయి. దీంతో వెంటనే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుఫాను ప్రభావం ఎక్కువగా వున్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని... బాధితులపట్ల సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులను తీసుకురావడంపై దృష్టిపెట్టాలని  అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి.

Latest Videos

వర్షాలతో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు. పునరావాసా కేంద్రాలనుండి ఇళ్లకు తిరిగివెళ్లేవారికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. నష్టపరిహారం అందించడంలో సానుభూతితో ఉండాలని సూచించారు. బాధితులెవ్వరూ ఆకలి బాధతో వుండకూడదని... రేషన్‌ పంపిణీలో ఎలాంటి లోపం ఉండకూడదని హెచ్చరించారు. 

Also Read  Cyclone Michaung:బాపట్ల వద్ద తీరాన్ని తాకిన మిచౌంగ్ తుఫాన్, 20 అడుగులు ముందుకొచ్చిన సముద్రం

భారీ వర్షాలతో వరదనీరు పొలాల్లో చేరింది... దీంతో చేతికిందేవచ్చే పంటకు తీవ్ర నష్టం జరిగింది. ఈ వరదనీటిని తొలగించడంలో రైతులకు సహాయం చేయాలని సీఎం జగన్ సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ఎవ్వరూ అధైర్యపడాల్సిన పనిలేదని ధైర్యం చెప్పారు.  పంటల రక్షణ, తడిసినా, రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో తోడుగా ఉంటుందని బాధిత అన్నదాతలకు జగన్ ధైర్యం చెప్పారు.  

ఇక ఈ తుఫాను కారణంగా చెట్టుకూలి చనిపోయిన ఓ కానిస్టేబుల్ కుటుంబానికి రూ.30 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. అతడి కుటుంబాన్ని పోలీస్ శాఖ మాత్రమే కాదు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా వుంటుందన్నారు. ఇంకా ఎక్కడైనా ప్రాణనష్టం జరిగివుంటే సమాచారం అందించాలని... బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని జగన్ ప్రకటించారు. 

వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ స్తంభాలు విరగడం, వైర్లు తెగిపడటంతో పలుచోట్ల సరఫరా నిలిచిపోయింది. కాబట్టి యుద్ధప్రాతిపదికన విద్యుత్‌ను పునరుద్ధరించాలని సూచించారు.వర్షాలు తగ్గుముఖంపట్టిన ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్యంపై దృష్టిపెట్టాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు.
 

click me!