టాలీవుడ్‌కు జగన్ సర్కార్ గుడ్‌న్యూస్.. థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి అనుమతి

By Siva KodatiFirst Published Oct 13, 2021, 8:08 PM IST
Highlights

సీని ప్రియులు, థియేటర్ల (theatres) యజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ప్రకటన జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ (100 percent occupancy) నిర్ణయం రేపటి నుంచే (గురువారం) అందుబాటులోకి రానుంది.

సీని ప్రియులు, థియేటర్ల (theatres) యజమానులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (ap govt) శుభవార్త చెప్పింది. ఇకపై రాష్ట్రంలో థియేటర్లను వంద శాతం ఆక్యూపెన్సీతో నడపొచ్చని ప్రకటన జారీచేసింది. ఈ వంద శాతం ఆక్యూపెన్సీ (100 percent occupancy) నిర్ణయం రేపటి నుంచే (గురువారం) అందుబాటులోకి రానుంది.

కరోనా నేపథ్యంలో ఇన్ని రోజులూ థియేటర్లలో ఆక్యూపెన్సీపై షరతులు విధిస్తూ వచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా కరోనా (coronavirus) తగ్గుముఖం పట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల థియేటర్‌ యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల గురువారం విడుదల కానున్న మహా సముద్రంతో పాటు, దసరాకు కానుకగా విడుదలవుతోన్న మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌, పెళ్లి సందడి వంటి సినిమాల లబ్ధి చేకూరుతుందని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టినప్పటికీ కర్ఫ్యూ నిబంధనలు ఇప్పటికీ అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం వాటిపై కూడా ఆంక్షలను సడలించింది. ఇకపై ఏపీలో రాత్రి 12 నుంచి ఉదయం 5 గంటల వరకు మాత్రమే కర్ఫ్యూ (ap curfew) నిబంధనలు అమల్లో వుంటాయని తాజా ఆదేశాల్లో తెలిపింది. దీంతో సెకండ్‌ షో సినిమా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రదర్శించుకునేందుకు అవకాశం లభించింది. వంద శాతం ఆక్యూపెన్సీతో నాలుగు షోలు ఆడడం ఇటు నిర్మాతలతో పాటు పండుగ సీజన్‌లో కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లాలనుకునే వారికి జగన్ సర్కార్ శుభవార్త చెప్పినట్లే.

ALso Read:పవన్‌‌కి, ఏపీ ప్రభుత్వంతో రాజీ కుదుర్చుతున్నాం.. ట్యాక్సులు కట్టకపోవడం వల్లే ఈ సమస్య.. నిర్మాత బన్నీ వాసు

ఇకపోతో కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం సూచించిన గైడ్‌లైన్స్ ప్రకారం చాలా రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకున్నాయి. అయితే కేవలం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లను తెరిచారు. తెలంగాణలో మాత్రం 100 శాతం ఆక్యుపెన్సీ అమలులో ఉండటంతో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో వున్న సమస్యలను ప్రస్తావిస్తూ ఏపీ ప్రభుత్వంపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (pawan kalyan) సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తెలుగు పరిశ్రమతో (tollywood) ఏపీ ప్రభుత్వ వర్గాల్లోనూ దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో థియేటర్లలో 100 శాతం ఆక్యూపెన్సీకి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

click me!