ప్రాణాలను ఫణంగా పెట్టి చంపావతి నదిని దాటి ప‌రీక్ష రాసిన యువ‌తి.. ఆమెను భుజాల‌పై మోసిన సోద‌రులు

Published : Sep 10, 2022, 09:57 AM ISTUpdated : Sep 10, 2022, 09:58 AM IST
ప్రాణాలను ఫణంగా పెట్టి చంపావతి నదిని దాటి ప‌రీక్ష రాసిన యువ‌తి.. ఆమెను భుజాల‌పై మోసిన సోద‌రులు

సారాంశం

పరీక్ష రాసేందుకు ఆ యువతి తన లైఫ్ ను రిస్క్ చేసింది. భారీగా ప్రవహిస్తున్న నదిని దాటింది. ఆమెను నదిని దాటించేందుకు సోదరులు కూడా సాహసం చేశారు. భుజాలపై మోసి ఒడ్డుకు చేర్చారు. 

ఓ యువ‌తి ప‌రీక్ష రాసేందుకు పెద్ద సాహ‌స‌మే చేసింది. ప్ర‌మాద‌క‌రంగా నీరు ప్ర‌వ‌హిస్తున్నా న‌దిని త‌న గ‌మ్య‌స్థానానికి చేరుకుంది. ఆమె సంక‌ల్పానికి ఇద్ద‌రు సోద‌రులు ఎంతో స‌హ‌క‌రించారు. న‌దిని దాటేందుకు సోద‌రికి స‌హాయం చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వైజాగ్ లో ఇది చోటు చేసుకుంది. తన ప్రాణాలను పణంగా పెట్టి మ‌రీ న‌దిని దాటిన యువ‌తి, ఆమెకు సాయం అందించిన సోద‌రుల‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

బీజేపీని ఓడించాలంటే ప్రతిపక్షాల్లో ఐక్యత అవ‌స‌రం - బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్

వివ‌రాలు ఇలా ఉన్నాయి. వైజాగ్ లో పరీక్షకు హాజరయ్యేందుకు 21 ఏళ్ల మహిళ ఇద్దరు సోదరుల సహాయంతో చంపావతి నదిని దాటింది. గజపతినగరం మండలం మర్రి వలస గ్రామానికి చెందిన తాడ్డి కళావతి విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. శనివారం జరిగే పరీక్షకు హాజరయ్యేందుకు శుక్రవారమే ఇంటి నుంచి ప్ర‌యాణం ప్రారంభించాల‌నుకున్నారు. భారీ వర్షాలు వ‌ల్ల చంపావతి నదిలో నీరు భారీగా ప్ర‌వ‌హిస్తోంది. దీంతో మ‌ర్రి వ‌ల‌స గ్రామానికి ప్ర‌పంచంతో సంబంధాలు తెగిపోయాయి. 

‘భారత్, దేఖో’.. రాహుల్ గాంధీ ధరించిన టీషర్ట్ ఎంతో తెలుసా?.. వివాదం రేపిన బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్...

క‌ళావ‌తి పరీక్ష విష‌యం తెలుసుకున్న ఇద్ద‌రు సోద‌రులు ఆమెను ఎలాగైనా న‌దిని దాటించాల‌ని అనుకున్నారు. కానీ అది చాలా సాహ‌సంతో కూడుకున్న ప‌ని. అయినా వారు వెన‌క‌డుగు వేయ‌కుండా సోదరిని భుజాల‌పైన ఎక్కించుకున్నారు. మెడ‌లోతు నీటిలో ప్రాణాల‌కు తెగించి న‌డుస్తూ న‌దిని దాటారు. త‌రువాత అందుబాటులో ఉన్న వాహ‌నాల ద్వారా ఆమె త‌న గ‌మ్యస్థానానికి చేరుకుంది. దీనికి సంబంధించిన వీడియోను ప‌లువురు రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 

డిస్మిస్ కానిస్టేబుల్ ప్రకాష్, ‘లక్ష్మీ’ వ్యవహారంలో ట్విస్టులే ట్విస్టులు.. రోజుకో వివాదం....

కాగా.. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న భారీ వ‌ర్షాల‌కు గజపతినగరం మండలంలోని మర్రి వలస, సిగడాం వలస, రాయవలస, పణుకువలస, శారదావలస తదితర గ్రామాల్లో రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చాలా గ్రామాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. 

PREV
click me!

Recommended Stories

Lokesh Motivate Speech: బ్రాహ్మణి అర్థం చేసుకుంటేనే నేను రోడ్లమీద తిరుగుతున్నా | Asianet News Telugu
Minister Nara Lokesh Speech: బాలయ్య డైలాగులతో రెచ్చిపోయిన నారాలోకేష్. ఇక సమరమే | Asianet News Telugu