అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని నోట్ రాసి.. గ్రామ సర్వేయర్ ఆత్మహత్యాయత్నం..

పని ఒత్తిడిని తట్టుకోలేక గ్రామ సచివాలయంలో సర్వేయర్‌గా పని చేస్తున్న ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నానికి ఒడిగట్టాడు. తోటి ఉద్యోగులు అతడిని కాపాడి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది.

The village surveyor attempted suicide by writing a note saying that he could not bear the pressure of the authorities..ISR

అధికారుల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాని లేఖ రాసి ఓ గ్రామ సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఇతర ఉద్యోగులు వెంటనే స్పందించి, ఘటనా స్థలానికి వెళ్లారు. బాధితుడిని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఈ ఘటన  ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగింది. సర్వేయర్లు వెల్లడించిన వివరాలు, ‘ఈనాడు’ కథనం ప్రకారం.. గంగవరం మండలంలోని జగ్గంపాలెం సచివాలయంలో నాగార్జున అనే వ్యక్తి గ్రామ సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామం ఆయన స్వస్థలం.

వివాహ వేడుకలో భారీ అగ్నిప్రమాదం.. 100 మంది మృతి, 150 మందికి గాయాలు 

Latest Videos

కాగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జగనన్న భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో లక్షాలు అందుకోవాలని పై అధికారులు అతడిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అయితే తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని నాగార్జున ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ కు తెలిపారు. అయినా కూడా తొందరగా ఎస్.ఆర్ తీసుకొని తన దగ్గరకు రావాలని ఆఫీసర్ ఆదేశించారు. దీంతో చేసేదేమీ లేక ఆయన సోమవారం సాయంత్రం ఐటీడీఏ ఆఫీసుకు వెళ్లారు.

చనిపోయి మూడు నెలలైనా ఇంట్లోనే వృద్ధురాలి మృతదేహం.. ఏలూరులో ఘటన

కానీ ఆ ఎస్.ఆర్ మండల సర్వేయర్ కు ఇచ్చేసి వెళ్లిపోవాలని అక్కడున్న పీవో సీసీ చెప్పారు. దీంతో ఆయన మనస్థాపానికి లోనయ్యారు. తరువాత అక్కడి నుంచి బయలుదేరారు. అనంతరం తాను అధికారుల ఒత్తిడిని తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోతున్నాంటూ ఓ లేఖ రాసి.. దానిని సర్వేయర్లు ఉన్న వాట్సప్ గ్రూప్ లో పోస్ట్ చేశాడు.

వరకట్న వేధింపులకు బలైన నవ వధువు.. సగం కాలిన శవంతో రోడ్డుపై ఆందోళన..

ఆ నోట్ ను తోటి సర్వేయర్లు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. జగ్గంపాలెం ప్రాంతానికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అక్కడే ఉన్న ఓ పెట్రోల్ బంక్ వద్ద అటవీ ప్రాంతంలో కిందపడి ఉన్నట్టు గమనించారు. అక్కడ ఓ సారి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అది విఫలమైంది. మరో సారి వేరే ప్రయత్నం చేశాడని సర్వేయర్లు వెల్లడించారు. వెంటనే బాధితుడిని తూర్పుగోదావరి జిల్లా గోకవరం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆయన ప్రస్తుతం ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.

ఆత్మ‌హ‌త్య అన్ని స‌మస్య‌ల‌కు ప‌రిష్కారం కాదు. ఆత్మ‌హ‌త్య‌తో ఎవ‌రూ ఏమీ సాధించ‌లేరు. ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నే ఆలోచ‌న వ‌స్తే వెంట‌నే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబ‌ర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు స‌హాయం చేస్తారు. 

vuukle one pixel image
click me!