చంద్రబాబు చెప్పిన రహస్యం

First Published Mar 20, 2017, 6:50 AM IST
Highlights

ఆయనకు జూన్ 2, 2014 అంటే కసి, కోపం.మంట.  ఎందుకో తెలుసా?

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఒక రహస్యం బయటపెట్టారు.

 

2014 ఎన్నికల్లో గెల్చాక, జూన్ రెండునే ఆంధ్ర ప్రదేశ్,తెలంగాణా రాష్రాలు ఉనికిలోకి వచ్చినా, ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు జూన్ 8 దాకా ఆగారు.

 

జూన్ 8 వతేదీనే ఆయన గుంటూరులో ఆర్భాటంగా పదవీ బాధ్యతులు  స్వీకరించారు. అటువైపు, తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేశఖర్ రావు మాత్రం అపాయింటెడ్ తేదీ జూన్ రెండునే ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు.

 

అయితే, చంద్రబాబుకు జూన్ 2 వతేదీ అంటే ఇష్టం లేదు. ఆయనకు కోపం. కసి. అందుకే ఆరోజు ఏమయినసరే పదవి చేపట్టరాదునుకున్నారు.

 

ఎందుకంటే, ఆరోజు ఇటలీ స్వాంతంత్య్ర దినోత్సవం. అంతేకాదు,  కాంగ్రె స్ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినం. యుపిఎ ప్రభుత్వం కావాలనే ఆ రోజును రాష్ట్ర విభజన దినం చేసింది. ఈ ప్రాముఖ్యంతో తెలుగు ప్రజలకు చీలుస్తారా,రాష్ట్రాన్ని విభజిస్తారా అనేది ఆయన కోపం.

 

‘ అందుకే నేను కసిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు నిర్ణయించుకున్నాను. జూన్ ఎనిమిదో తేదీన పదవీ బాధ్యతలు స్వీకరించాను,’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

 

‘ఇపుడు ముఖ్యమంత్రిగా ఉన్నాను మళ్లీ కూడా నేను ముఖ్యమంత్రి’ అని అన్నారు.  ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సొంత బొమ్మ పెట్టుకుని గెలిచిన నాయకులిద్దరే నని, అందులో ఒకరు ఎన్టీ ఆర్ కాగా, రెండో వ్యక్తి తానే నని అన్నారు.

 

 వైఎస్ ఆర్ తో సహా మిగతా ముఖ్యమంత్రులంతా ఢిల్లీ నాయకుల ఫోటో లుపెట్టుకుని గెలిచారని అన్నారు.

 

 ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గవర్నర్ ప్రపంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చకు  సమాధానమిస్తూ ఈ విషయం వెల్లడించారు.

click me!