కుప్పం నియోజకవర్గంలోని కుప్పం- పలమనేరు నేషనల్ హైవే పక్కన ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడి ఇంటి నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. నిర్మాణానికి అనుమతులు రాకపోవడంతో కొంత కాలం కిందట పనులు నిలిచిపోయాయి. తాజాగా అనుమతులు వచ్చాయి.
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలోని కుప్పంలో ఇంటిని నిర్మించాలని భావిస్తున్నారు. అయితే దానికి అనుమతులు లభించకపోవంతో ఏడాదిన్నరగా పనులు నిలిచిపోయాయి. తాజాగా ఆ ఇంటి నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. అన్ని అనుమతులు లభించాయి.
దీంతో ఆ ఇంటి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు చాలా కాలంగా అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అయితే అక్కడ సొంతింటిని నిర్మించాలనే ఉద్దేశంతో ఏడాదిన్నర కిందట శాంతిపురం మండలంలోని కుప్పం- పలమనేరు నేషనల్ హైవే పక్కన రెండు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ ఇంటికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాలేదు. దీంతో పనులు నిలిచిపోయాయి. కాగా.. మూడు రోజుల కిందట పీఎంకే ఉడా అనుమతులు మంజూరు చేసింది.
దీంతో ఆగిపోయిన ఆ ఇంటి పనులను ఆదివారం మళ్లీ మొదలుపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, మునిరత్నం తదితరులు పూజ నిర్వహించి, పనులను లాంఛనంగా ప్రారంభిచారు. ఈ సంవత్సరం చివరి వరకు ఇంటిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.