
ధైర్యమంటే తెలంగాణా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుదే. ఈరోజు సాయంత్రం మీడియా సమావేశంలో గంటపాటు మాట్లాడిన కెసిఆర్ భారతీయ జనతా పార్టీ అద్యక్షుడు అమిత్ షాను ఏకిపారేసారు. ఇక్కడే పలువురు ఏపి ముఖ్యమంత్రి చద్రబాబునాయుడు వైఖరిని, వ్యక్తిత్వాన్ని కెసిఆర్ తో పోల్చి చూస్తున్నారు.
అమిత్ ప్రకటనలు, ఆరోపణల్లోని డొల్లతనం, దళితవాడల్లో చేసిన భోజనంతో సహా దేన్నీ వదిలిపెట్టలేదు. అమిత్ షా కాదు తమకు తెలంగాణానే బాద్షా అంటూ ఒక్క దెబ్బతో అమిత్ షాను తీసిపారేసారు. మూడు రోజుల పర్యటనలో అమిత్ తెలంగాణా పర్యటనలో చెప్పిన మాటలను, చేసిన ప్రకటనలను ఒక్క ప్రెస్ మీట్లో కొట్టి పారేసారు కెసిఆర్.
తెలంగాణాలో పరిస్ధితి అలా వుంటే ఏపిలో అందుకు భిన్నంగా ఉంది. 24 గంటలూ నరేంద్రమోడి కనుసన్నల్లో పడేందుకే చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భాజపాతో తమకు పొత్తుంటుందో ఉండదో అన్న బెంగే చంద్రబాబులో ఎక్కువ కనబడుతోంది. పొత్తుల విషయంలో తన ఆలోచనలకు ఎవరు భిన్నంగా మాట్లాడినా చంద్రబాబు సహించటం లేదు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కలవటాన్ని చంద్రబాబు అస్సలు సహించలేకున్నారు. వారిద్దరి భేటీ తర్వాత మరింత అభద్రత కనబడుతోంది. ఎప్పుడేం అవుతుందోనన్న భయమే చంద్రబాబును పట్టి పీడిస్తోంది. వచ్చే ఎన్నికల్లో భాజపాతో పొత్తు లేకున్నా, లేదా ఇపుడే పొత్తు విచ్చినమైనా తన పరిప్ధితేమిటి అన్న బెంగే చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది.
గడచిన మూడేళ్ళుగా కేంద్రం పట్ల చంద్రబాబు చూపుతున్న భయ, భక్తులను గమనిస్తున్నారు. కేంద్రాన్ని పొరబాటుగా కూడా ఒక్క మాట మాట్లడలేకున్నారు. విభజన తర్వాత తెలంగాణా, ఏపిలను కేంద్రం ఒకే విధంగా ట్రీట్ చేస్తోంది.
రాష్ట్రాలకు ఇచ్చినదానిక కన్నా ఎక్కువిచ్చినట్లు చెప్పుకుంటోంది. ఆ విషయంలోనే అమిత్ షాను కెసిఆర్ వాయించేసారు. అదే చంద్రబాబు ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి చాలా ఇచ్చిందంటూ మోడి భజన చేస్తున్నారు.
విభజన చట్టంలోని ప్రయోజనాలను సాధించటంలో పూర్తిగా విఫలమైనా కేంద్రాన్ని మాత్రం పల్లెత్తుమాట అనలేకున్నారు. నిధుల విషయంలో కోత పెట్టినా గట్టిగా అడగటం లేదు. విభజన చట్టంలోని విద్యాసంస్ధలను ఇవ్వటమే మహాభాగ్యంగా చంద్రబాబు, మోడి స్తోత్రాన్ని పఠిస్తున్నారు. తాను కేంద్రాన్ని నిలదీయటం అటుంచి ప్రతిపక్షాలు అడుగుతున్నా సహించలేకున్నారు. పూర్తిగా కేంద్రానికి ఊడిగం చేస్తున్నారు. ఈపాటికే అర్ధమైపోయుంటంది ఇద్దరు సిఎంలకు తేడా ఏమిటో.