
తన వైవాహిక జీవితానికి అడ్డువస్తున్నారనే కారణంతో ప్రియురాలు, తన ఇద్దరు కూతుర్లను ఓ వ్యక్తి నదిలోకి తోసేశాడు. ఈ ఘటన ఈ నెల 6వ తేదీన జరగ్గా.. తాజాగా నిందితుడిని అరెస్టు చేశారు. ఇది ఏపీలోని అమలాపురం ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అమలాపురం ఎస్సై ఎస్.శ్రీధర్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ట్రక్కు..10 మంది దుర్మరణం..
గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుప్పాల సుహాసిని (30) కు తన భర్తతో విడిపోయింది. తన భర్త ద్వారా ఆమెకు లక్ష్మీసాయి కీర్తన అనే 13 ఏళ్ల కూతురు ఉంది. గుడివాడకు చెందిన ఉలవ సురేష్ తో 2019 నుంచి సన్నిహితంగా ఉంటోంది. అతడి ద్వారా ఆమె జెస్సీ అనే మరో కుమార్తెకు జన్మనిచ్చింది.
అయితే సురేష్ తరచూ సుహాసిని నుంచి డబ్బులు తీసుకుని ఖర్చు చేస్తుండేవాడు. ఇది అతడికి ఒక అలవాటుగా మారింది. కొంత కాలం తరువాత దీనిపై సుహాసిని అభ్యంతరం తెలిపింది. దీంతో వారి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉండగా.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట సమీపంలోని ఏడిద గ్రామానికి చెందిన మరో మహిళను సుహాసినికి తెలియకుండా సురేష్ వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయం సుహాసినికి తెలియడంతో అది కూడా వారి మధ్య గొడవకు దారితీసింది.
కాంగ్రెస్ వ్యూహాత్మక అడుగులు.. తెలంగాణలో ప్రియాంక గాంధీ, డీకే శివ కుమార్ లకు ముఖ్య బాధ్యతలు..
దీంతో తన వైవాహిక జీవితానికి మార్గం సుగమం చేసేందుకు సుహాసిని, సవతి కుమార్తె కీర్తన, కుమార్తె జెస్సీలను హతమార్చాలని సురేష్ నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న సురేష్ సుహాసినిని, పిల్లలను తీసుకుని రాజమహేంద్రవరం వెళ్లి రావులపాలెం వద్ద గౌతమి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. గోదావరి జలాలతో సెల్ఫీ దిగుతానని సుహాసినికి చెప్పాడు. దీంతో ఆమె నమ్మి కారు దిగింది. సెల్ఫీ తీసుకుంటుండగా ప్రియురాలిని నదిలోకి తోసేశాడు.
దారుణం.. గంజాయి తాగి, ఆరేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ యువకుడు..
ఇది గమనించిన లక్ష్మీసాయి కీర్తన కారులో ఉన్న జెస్సీని తీసుకొని పారిపోయింది. దీంతో సురేష్ వెంబడించి జెస్సీని లాక్కొని నదిలో విసిరేశాడు. అనంతరం కీర్తనను పట్టుకుని కూడా నదిలో పడేశాడు. అదృష్టవశాత్తూ కీర్తన బ్రిడ్జి కింద ఉన్న పైపును పట్టుకుంది. తన వద్ద ఉన్న ఫోన్ తో 100కు డయల్ చేసింది. 10 నిమిషాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను రక్షించారు. అనంతరం జరిగిన విషయాన్ని కీర్తన పోలీసులకు తెలియజేసింది. రావులపాలెం పోలీసులు సురేష్ ను అరెస్టు చేశారు.