
అధికారమే లక్ష్యంగా అడుగులేయాలని కాపు నేతలు నిర్ణయించుకున్నారు. పలువురు కాపు నేతలు పార్టీలు పెట్టి విఫలమయ్యారని అలా కాకుండా ఇప్పుడు పక్కా ప్రణాళికతో అధికారం చేపట్టేందుకు కార్యాచరణ నిర్వహించాలని ఆ పార్టీ నేతలు భావించారు. ఈ మేరకు ఇటీవలే కాపు నాయకుల కోర్ కమిటీ సమావేశం నిర్వహించి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలో ఏపీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావు, వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఉన్నారు. వీరితో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన తోట చంద్రశేఖర్, రామ్మోహన్‌రావు, అరేటి ప్రకాశ్, కేవీ రావు, ఎంహెచ్ రావు వంటి నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించారు.
ప్రకాశం జిల్లాలో మహిళకు ఒమిక్రాన్, 17కు చేరిన కేసులు
కాపు సామాజిక వర్గానికి అధికారాన్ని చేపట్టంత బలం ఉందని అన్నారు. అందుకే ఈ సారి పక్కా వ్యూహంతో నడుచుకోవాలని అనుకున్నారు. దీంతో పాటు గతంలో కాపు సామాజిక వర్గానికి చెందిన నటుడు చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు పార్టీలు పెట్టారని అన్నారు. అయితే వారు అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయారని తెలిపారు. వారిలా విఫలం కాకుండా పక్కా ప్రణాళికతో విజయం సాధించే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. కాపులు ఏదో ఒక రాజకీయ పార్టీ అధికారం చేపట్టడానికి ఉపయోగపడుతున్నారే తప్పా.. అధికారం చేపట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలా కాకుండా ఈ సారి కాపు సామాజిక వర్గం అంతా సొంతంగా అధికారం చేపట్టేలా మెదులుకోవాలని అనుకున్నారు. కాపు నాయకులు ఏ పార్టీలో ఉన్న సామాజిక వర్గానికి ప్రియారిటీ ఇచ్చేలా చూసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని అన్ని పార్టీల నాయకులు గమనించాలని కోరారు.
విభజన సమస్యలు.. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు
ఈ సమావేశం సందర్భంగా బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. బీజేపీ తమ సామాజిక వర్గాన్ని గుర్తించిందని తెలిపారు. అందుకే తనకు అధ్యక్ష పదవి ఇవ్వండతో పాటు జాతీయ కమిటీలో తనకు స్థానం కల్పించిందని అన్నారు. ఈ సందర్భంగా మిగితా కాపు నాయకులు కూడా ఆయా పార్టీలో తమకు లభిస్తున్న ప్రియారిటీని చెప్పుకున్నారు. కోర్ కమిటీ సమావేశంలో వివరించారు.
అయితే భేటి మొదటి సారి కావడంతో ఇప్పుడు పెద్దగా కార్యచరణకు సంబంధించిన నిర్ణయాలేమీ తీసుకోలేదు. ఈ కమిటీ మళ్లీ త్వరలోనే భేటీ అయ్యి పలు నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు ఏ పార్టీలో ఉన్నా కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అందరూ అధికారం చేపట్టేందుకు కష్టపడాలనే నిర్ణయానికి వచ్చారు. అందరూ సామరస్యంగా పని చేసుకుపోవాలని భావించారు. అయితే ఈ సమావేశానికి ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఎవరూ హాజరుకాలేదు. వచ్చే ఏడాది జనవరిలో రెండో సారి ఈ కమిటీ భేటి కానుంది. అప్పుడు పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ సమావేశంలో వైసీపీకి చెందిన నాయకులు హాజరవుతారో లేదా చూడాల్సి ఉంది.