'బోసడీకే' అసలు ఆ మాటకు అర్ధం ఏంటంటే.. వైసీపీ ఎంపీ రఘురామ క్లారిటీ

Siva Kodati |  
Published : Oct 20, 2021, 03:59 PM IST
'బోసడీకే' అసలు ఆ మాటకు అర్ధం ఏంటంటే.. వైసీపీ ఎంపీ రఘురామ క్లారిటీ

సారాంశం

'బోసడీకే'... అన్నపదం ఏపీలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. టీడీపీ నేత పట్టాభి (kommareddy pattabhi) మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ని ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతనే వైసీపీ కేడర్ భగ్గుమంది.

ఏపీ ముఖ్యమంత్రి (ap cm) వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డిపై (ys jagan mohan reddy) టీడీపీ (tdp) నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (kommareddy pattabhi) చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన సంగతి తెలిసిందే. దీంతో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాల్లో వైసీపీ శ్రేణులు విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత టీడీపీ బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు (ap bandh) పిలుపునివ్వడం జరిగిపోయింది. అదే సమయంలో పట్టాభి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ముఖ్యంగా 'బోసడీకే'... అన్నపదం ఏపీలో ఇప్పుడు అత్యంత చర్చనీయాంశమైంది. టీడీపీ నేత పట్టాభి (kommareddy pattabhi) మంగళవారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్‌ని ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతనే వైసీపీ కేడర్ భగ్గుమంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై అధికార పార్టీ కార్యకర్తలు దాడులకు పాల్పడటం తెలిసిందే. అయితే అసలు 'బోసడీకే' అంటే అర్థం తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారు. అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం నెట్టింట్లో జల్లెడపడుతున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (raghu rama krishnam raju) సీన్‌లోకి వచ్చారు. 'నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి రాష్ట్రం అతలాకుతలం అయింది. దీనికి కారణం... టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అనకూడదని మాట అన్నారు. దానికి ఇది రియాక్షన్. పట్టాభి ఏమన్నారు అనేది తాను చూశానని.. బోసడీకే అనేది హిందీ పదం అనుకుంటా అని రఘురామ అభిప్రాయపడ్డారు. ఈ పదానికి అర్థం ఏమిటని నేనే నా స్నేహితులు ఇరవై, పాతిక మందిని అడిగానని.... వైసీపీలోని అజ్ఞాత మిత్రులను కూడా అడిగాని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. వారంతా కూడా మాకు తెలియదు... బూతు పదమేమో అని చెప్పారని ఆయన గుర్తుచేశారు. దీంతో తాను గూగుల్‌లో వెతికానని... అందులో చాలా స్పష్టంగా  'సర్... మీరు బాగున్నారా' అని వుందన్నారు.  సంస్కృతంలో బోసడీకే అనే పదానికి అర్థం' అది అని రఘురామ వివరించారు. మరి దీనిపై వైసీపీ శ్రేణులు ఎలా స్పందిస్తాయో వేచి చూడాలి.

Also Read:పట్టాభి ఒక ఊరపంది.. చంద్రబాబు అంతు చూడటానికి నేనొక్కడిని చాలు: కొడాలి నాని

కాగా, తమ పార్టీ కార్యాలయాలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపీ) కార్యకర్తల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బుధవారం బంద్ నిర్వహిస్తోంది. టీడీపీ కార్యకర్తలు బుధవారం ఉదయం నుంచే రోడ్ల మీదికి వచ్చి ఆందోళనలకు దిగారు. దీంతో తెలుగు తమ్ముళ్లను, నాయకులను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అయినప్పటికీ పసుపు శ్రేణులు నిరసన తెలుపుతూనే వున్నాయి. 

ఈ క్రమంలో నిన్న(మంగళవారం) టిడిపి, వైసిపిల మధ్య భౌతిక యుద్దం జరగ్గా నేడు మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా బుధవారం రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టిడిపి నాయకులకు గట్టిగా హెచ్చరించడంతో పాటు సవాల్ కూడా విసిరారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ys jaganmohan reddy ని పట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడితే తోలు తీస్తామంటూ టిడిపి నేతలకు మంత్రి anil kumar yadav తనదైన శైలిలో హెచ్చరిక జారీ చేశారు. ysrcp అధ్యక్షులు జగన్ ను అనడం కాదు ఒక్క వైఎస్ఆర్ సిపి కార్యకర్తమీద చెయ్యి వేసి చూడండి... తోలు వలిచేస్తాం అని హెచ్చరించారు. 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu