ఆనాడు కోడెల శివప్రసాద్ మహానాడులో పాల్గొనలేదా?.. నేను వైసీపీ ప్లీనరీలో పాల్గొంటే తప్పా..?: స్పీకర్ తమ్మినేని

Published : Jul 09, 2022, 11:21 AM IST
ఆనాడు కోడెల శివప్రసాద్ మహానాడులో పాల్గొనలేదా?.. నేను వైసీపీ ప్లీనరీలో పాల్గొంటే తప్పా..?: స్పీకర్ తమ్మినేని

సారాంశం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై చర్చను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన తర్వాత పరిపాలన వికేంద్రీకరణ- పారదర్శకత తీర్మానంపై చర్చను శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లిన సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందన్నారు. మూడేళ్ల ప్రగతిపై సమీక్షకే ఈ ప్లీనరీ నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. ప్లీనరీకి భారీగా వైసీపీ శ్రేణులు పాల్గొన్నారని తెలిపారు.  గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ కోడెల శివ ప్రసాద్ పాల్గొనలేదా అని ప్రశ్నించారు. తాను వైసీపీ ప్లీనరీలో పాల్గొంటే తప్పా..? అని ప్రశ్నించారు. తాను వైసీపీ ప్రాథమిక సభ్యుడినని.. ఆ తర్వాత ఎమ్మెల్యే.. ఆ తర్వాతే స్పీకర్‌నని చెప్పారు. ప్లీనరీ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చొవాలా అని ప్రశ్నించారు. 

గాంధీ కలలుకన్న గ్రామస్వరాజ్యంను సీఎం జగన్ తీసుకొచ్చారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు జరుగుతున్నాయని చెప్పారు.  సంక్షేమ పథకాలు ఎల్లో మీడియాకు కనిపించడం లేదన్నారు. జగన్ నాయకత్వంలో వైసీపీ 175 స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌కు భగవంతుడు అన్ని విధాల సహకరించాలని కోరుకుంటున్నట్టుగా చెప్పారు. మరోసారి సీఎం జగన్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపడతారని చెప్పారు. 

జగన్ గెలవకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని అన్నారు. ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ప్రగతి కోసం, అభివృద్ది కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి టార్చ్ బెరర్‌గా జగన్ ఉండాలని ఆకాంక్షించారు. జగన్ వెంట కలిసి నడిసేందుకు తాము అందరం సిద్దంగా ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఇకపై పార్టీ ప్రతి కార్యక్రమానికి తాను హాజరై తీరుతానని చెప్పారు. జై జగన్.. జై జై జగన్ అంటూ ప్రసంగాన్ని ముగించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు