
అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత పరిటాల శ్రీరామ్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. రైతు సమస్యలపై శనివారం గొందిరెడ్డిపల్లిలో నిరసనకు పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పరిటా శ్రీరామ్ ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. చలో గొందిరెడ్డిపల్లి కార్యక్రమానికి వెళ్లకుండా పరిటాల శ్రీరామ్‌కు నోటీసులు ఇచ్చారు. మరోవైపు శ్రీరామ్ ఇంటికి భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నారు. అంతా పరిటాల ఇంటి వద్ద కూర్చొని నిరసనకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రజాస్వామ్య పద్ధతిలో తాము పోరాటం చేస్తుంటే పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. వైసీపీ నేతల ప్రోత్బలంతో మమ్మల్ని అడ్డుకోవడం పోలీసులకు ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించిన శనివారం జరగబోయే కార్యక్రమానికి కచ్చితంగా వెళ్లి తీరతామని చెబుతున్నారు. “చలో గొందిరెడ్డిపల్లి” కార్యక్రమాన్ని ముందస్తుగా అడ్డంకులు సృష్టించడానికి పోలీసులను ఉపయోగించుకుంటూ నోటీసులు ఇవ్వడం సరైన పద్ధతి కాదని చెప్పారు.