ఈ నెల 20న టీకా తీసుకున్న తరువాత ఏఎన్ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్, ఆశా వర్కర్ విజయలక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి.
గుంటూరు: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న ఓ ఆశా వర్కర్ బ్రెయిన్ స్ట్రోక్ తో మరణించడం కలకలం రేపింది. గత బుధవారం తాడేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే గొట్టిముక్కల లక్ష్మి (38), బొక్కా విజయలక్ష్మి (42) కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే టీకా తీసుకున్న తర్వాత వీరిద్దరు అస్వస్థతకు గురవడంతో జిజిహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి విజయలక్ష్మి బ్రెయిన్ డెడ్ కు గురయ్యింది.
ఈ నెల 20న టీకా తీసుకున్న తరువాత ఏఎన్ఎం లక్ష్మికి తలనొప్పి, ఫిట్స్, ఆశా వర్కర్ విజయలక్ష్మిలో మగత, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. దీంతో ఇద్దరినీ 22వ తేదీన తేదీన గుంటూరు జీజీహెచ్ కి చికిత్స నిమిత్తం తరలించారు. లక్ష్మి చికిత్స తరువాత సాధారణ స్థితికి చేరుకోగా విజయలక్ష్మి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.
read more ఏపీలో పడిపోయిన కరోనా కేసులు: 8,86,694కి చేరిన సంఖ్య
ఈ విషయం తెలుసుకున్న వైద్యాధికారులు, జీజీహెచ్ కి చేరుకుని ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వీరికి ఏ టీకా వేరియంట్ ను ఇచ్చారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. అయితే ఆమె మరణానికి వ్యాక్సిన్ కారణం అయివుండదని... ఇతర అనారోగ్య కారణాలతోనే మరణించి వుంటుందని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. విజయలక్ష్మికి వేసిన టీకా వయల్ నుంచే మరో డాక్టర్ కు వ్యాక్సిన్ వేసినట్లు... అతనిలో ఎటువంటి రియాక్షన్ రాలేదని అధికారులు తెలిపారు.