పది పరీక్షలు రద్దు, ఇంటర్ ఫెయిల్ అయినవారు కూడా పాస్: ఏపీ ప్రభుత్వం

By Sreeharsha Gopagani  |  First Published Jun 20, 2020, 6:08 PM IST

ఆంధ్రప్రదేశ్ లో పదవతరగతి పరీక్షల రద్దుతోపాటుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్ . ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లలో ఫెయిల్ అయినవారందరికీ... సప్లమెంటరీల అవసరం లేకుండా పాస్ చేస్తున్నట్టుగా తెలిపారు మంత్రి.


ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో పదవ తరగతి పరీక్షలను రద్దుచేస్తున్నట్టుగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల. గురించి ఆందోళన లేకుండా చెయ్యాలని సీఎం చెప్పారని, విద్యార్థులు ఆరోగ్యం దృష్టి లో పెట్టుకుని సీఎం జగన్ చెప్పినట్టుగా పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. 

ఏపీ.లో పదో తరగతి పరీక్షలు వచ్చే నెల.10 నుంచి నిర్వహించాలని తొలుత అనుకున్నామని, ఆన్ లైన్  క్లాసులు కూడా నిర్వహించామని అన్నారు. విద్యార్థుల పరీక్షల మూడ్ పోగొట్టకుండా అన్ని చర్యలు కూడా తీస్కున్నామని తెలిపారు. 

ఒక క్లాస్ రూమ్.లో కేవలం 12 మందిని మాత్రమే పెట్టి పరీక్ష నిర్వహించాలని అనుకున్నామని మంత్రి అన్నారు. కేవలం  విద్యాశాఖ అధికారులు తో మాత్రమే పరీక్షలు నిర్వహించడం కుదరదని, వివిధ శాఖల సమన్వయంతో నిర్వహించాలి కాబట్టి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు తెలిపారు మంత్రి. 

ఆంధ్రప్రదేశ్ లో పదవతరగతి పరీక్షల రద్దుతోపాటుగా ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి ఆదిమూలపు సురేష్ . ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లలో ఫెయిల్ అయినవారందరికీ... సప్లమెంటరీల అవసరం లేకుండా పాస్ చేస్తున్నట్టుగా తెలిపారు మంత్రి. దీనిపై విద్యార్థులు సంతోషం వ్యక్థము చేస్తున్నారు. 

Latest Videos

click me!