ట్రావెల్స్ డాక్యుమెంంట్స్ ఫోర్జరీ కేసు: జేసీకి మరో షాక్

By telugu teamFirst Published Jun 20, 2020, 3:11 PM IST
Highlights

జేసీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. జేసీ ట్రావెల్స్ డాక్యుమెంట్ల ఫోర్జరీ కేసులో తాడిపత్రి పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ముగ్గురు కూడా జేసీ వర్గానికి చెందినవారు. 

అనంతపురం: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. ముగ్గురు జేసీ వర్గీయులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నకిలీ పత్రాలు సమర్పించి బిఎస్ -3 వాహనాలను బీఎస్ -4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో ఆ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 

నాగేశ్వర రెడ్డి, సోమశేఖర్, రమేష్ లను అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రైవేట్ ఆపరేటర్లకు వారు లారీలను విక్రయించినట్లు గుర్తించారు. నకిలీ క్లియరెన్స్ సర్టిఫికెట్లు సృష్టించి పోలీసుల సంతకాలను వారు ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. 

ఇదిలావుంటే, జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిలను పోలీసులు శుక్రవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో వారు రెండు రోజుల పాటు పోలీసులు వారిని తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.

వారిద్దరిని ఈ నెల 13వ తేదీన అరెస్టు చేసిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. దాంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న 

కాగా, జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వారిద్దరు ఆన్ లైన్ లో కోర్టుకు నివేదించుకున్నారు. ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనంతపురం కోర్టు వారిద్దరినీ విచారించింది. 

మరో మూడు కేసుల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలను పీటీ వారంట్ మీద కస్టడీకి కోరారు. దాంతో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది.

click me!