రామతీర్థంలో టెన్షన్ టెన్షన్: చలో రామతీర్థం, మంత్రుల సందర్శనతో

By Arun Kumar P  |  First Published Jan 3, 2021, 9:39 AM IST

మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ రేపు(సోమవారం) రామతీర్థంను సందర్శించనున్నారు. ఈ మేరకు వారి పర్యటన ఖరారయినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.


విజయనగరం జిల్లా రామతీర్ధంలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ(ఆదివారం) హైందవ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ''చలో రామతీర్థం'' జరగనుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి హైందవ సంఘాల ప్రతినిధులు రామతీర్థంకు భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావణం నెలకొంది. 

ఆలయంలోని శ్రీరాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో గత ఐదు రోజులుగా నిరసన చేస్తున్న బీజేపీ శిబిరాన్ని శనివారం రాత్రి పోలీసులు తొలిగించారు. దీంతో బిజెపి నాయకులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తల చోటుచేసుకుంది. 

Latest Videos

ఇక మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ రేపు(సోమవారం) రామతీర్థంను సందర్శించనున్నారు. రేపు ఉదయం 10 గంటల తర్వాత బొత్స, వెల్లంపల్లి ఆలయం వద్దకు చేరుకునున్నారు. ఇక ఇప్పటికే రామతీర్థం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి అశోక్ గజపతిరాజు తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

read more  బీజేపీకి దగ్గరయ్యేందుకే.. జైశ్రీరామ్ అంటే మోడీ కాపాడరు: బాబుకు వెల్లంపల్లి చురకలు

ఇక నిన్న(శనివారం)ఒకేసారి టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతల పర్యటనతో రామతీర్థం రణరంగంగా మారింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబు రామతీర్థం చేరుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ప్రతిపక్షనేత మెట్ల మార్గం వద్ద కొబ్బరికాయ కొట్టి బోడికొండపైకి బయల్దేరారు.ఆయన వెంట కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు, అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, టీడీపీ శ్రేణులు ఉన్నాయి. 

అయితే ఈ సమయంలో రామతీర్థంలో ఆలయానికి అధికారులు తాళం వేయడం విమర్శలకు తావిచ్చింది. చంద్రబాబు అక్కడికి చేరుకోవడానికి ముందే అధికారులు లాక్ వేశారు. ఉద్దేశపూర్వకంగానే తాళం వేశారంటూ తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు. ఆలయానికి తాళం వేసి ఉండటంతో చంద్రబాబు అక్కడి నుంచి వెనుదిరిగారు.

అయితే కొండమీద అధికారులతో జరిగిన సంఘటనపై బాబు ఆరా తీసి, కొనేరును పరిశీలించారు. అయితే చంద్రబాబు కంటే ముందే ఆలయాన్ని సందర్శించారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. 

click me!