హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2021, 3:14 PM IST
Highlights

హిందూపురంలో (Hindupur) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna) ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలకృష్ణ ఇంటికి ముట్టడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. 
 

అనంతపురం జిల్లా హిందూపురంలో (Hindupur) స్థానిక ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ (nandamuri balakrishna)  ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలకృష్ణ ఇంటికి ముట్టడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విఫలయత్నం చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందూపురం పట్టణ సమీపంలోని డంపింగ్ యార్డు తరలింపు అంశంపై కొద్ది రోజులుగా వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్దం జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీల నాయకులు పరస్పరం విమర్శలు చోటుచేసుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం హిందూపురంకు చేసిందేమి లేదని TDP నాయకులు మండిపడుతున్నారు. 

ఈ క్రమంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని టీడీపీకి సవాలు విసిరారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు వారి సవాలుపై చర్చించేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే టీడీపీ నాయకులు హిందూపురంలోని స్థానిక శాసనసభ్యుడు బాలకృష్ణ ఇంటికి చేరుకన్నారు. దీంతో వైసీపీ నాయకులు కూడా బాలకృష్ణ ఇంటి వద్దకు వెళ్లేందుకు యత్నించారు. 

అయితే ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. వైసీపీ నాయకులు బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకోకుండా అడ్డుకున్నారు. అయితే పోలీసులు తమను అడ్డుకోవడంపై వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో ఇరు పార్టీల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. 

ఇదిలా ఉండే హిందూపురంలో కొద్ది రోజులుగా డంపింగ్ యార్డ్‌కు తరలింపుకు సంబంధించిన వివాదం కొనసాగుతుంది. వైసీపీ ప్రభుత్వం హిందూపురం అభివృద్దిని విస్మరించిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నియోజకర్గ అభివృద్దికి నిధులు కేటాయించడం లేదని మండిపడుతున్నారు. 
 

click me!