టాలీవుడ్ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. ఏ థియేటర్ , ఏ కిరాణ దుకాణం రెవిన్యూను లెక్కగట్టారో హీరో నాని చెప్పాలన్నారు. ఇవాళ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంత్రి పేర్నినానితో భేటీ అయ్యారు.
అమరావతి: Cinema Ticket ధరలను పెంచాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోరారని ఏపీ రాష్ట్ర మంత్రి Perni Nani చెప్పారు. Tollywood సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంగళవారం నాడు ఏపీ రాష్ట్ర మంత్రి పేర్ని నానితో గంటన్నరకు పైగా సమావేశమయ్యారు. పేర్ని నానికి టికెట్ రేట్లపై ప్రతి పాదనలు ఇచ్చారు డిస్ట్రిబ్యూటర్లు. సినిమా హాల్స్ లో పరిస్థితులు మెరుగుపర్చాలని సూచించాం సమయం ఇచ్చినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదని మంత్రి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల ప్రతినిధులకు చెప్పారు. అందుకే సినిమా theater లో తనిఖీలు ప్రారంభించామన్నారు.
undefined
also read:మా ట్యాక్స్‌తోనే మీకు లగ్జరీలు.. అవినీతితో లక్షల కోట్లు : ఏపీ మంత్రులకు సిద్ధార్థ్ చురకలు
ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ప్రజలు ఇబ్బందిపడకుండా సంఘాలు ఇచ్చిన వినతులను పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కొందరు ధియేటర్ల licenseలను రెన్యూవల్ చేసుకోకుండానే నడిపిస్తున్నారని మంత్రి పేర్ని నాని చెప్పారు.అనుమతులు లేకుండా నడుపుతేున్న సినిమా థియేటర్లను సీజ్ చేసినట్టుగా మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 130 థియేటర్లను సీజ్ చేశామన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ 8వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 35 జీవోను జారీ చేసిందని మంత్రి గుర్తు చేశారు. అయితే ఎప్పుడో జీవో వస్తే ఇవాళ సినిమా థియేటర్లు మూయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎవరితోనైనా చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగానే ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సమస్యలేమిటో చెబితే వినడానికి తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు నుండి తమకు ఎలాంటి సమాచారం రాలేదని మంత్రి పేర్ని నాని తెలిపారు.
హీరో నాని, సిద్దార్ద్‌లకు మంత్రి నాని కౌంటర్
సినిమా థియేటర్ కు వచ్చే రెవిన్యూ కంటే కిరాణా దుకాణానికి వచ్చే ఆదాయం ఎక్కువ అని టాలీవుడ్ Hero Nani చేసిన కామెంట్స్ పై మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సినిమా థియేటర్ కు వచ్చిన రెవిన్యూ, ఆ థియేటర్ పక్కనే ఉన్న కిరాణా దుకాణానికి వచ్చిన రెవిన్యూను లెక్క గట్టే హీరో నాని కామెంట్స్ చేసి ఉంటారని మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. ఏ ఊర్లోని సినిమా థియేటర్, కిరాణా దుకాణం రెవిన్యూను హీరో నాని లెక్కగట్టారో తనకు తెలియదన్నారు. హీరో నాని బాధ్యతాయుతంగానే మాట్లాడుతారని ఆయన చెప్పారు. హీరో సిద్దార్ధ్ చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. మంత్రులు, లగ్జరీలను తగ్గించుకోవాలని మరో హీరో siddharth చేసిన వ్యాఖ్యలపై కూడా మంత్రి స్పందించారు. తాము కట్టే పన్నులతోనే మంత్రులు విలాసాలు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కూడా వ్యంగ్యంగా మంత్రి స్పందించారు.తమిళనాడు సీఎంStalin ను ఉద్దేశించి హీరో సిద్దార్ద్ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనన్నారు. హీరో సిద్దార్ధ్ Chennaiలో ఉంటూ పన్నులు కట్టేది తమిళనాడులో కానీ ఏపీలో కాదన్నారు. తమిళనాడు రాష్ట్రానికిచెందిన మంత్రులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారేమోనన్నారు. తాము విలాసంగా బతుకుతున్నామని హీరో సిద్దార్ధ్ ఏమైనా చూశారా అని మంత్రి ప్రశ్నించారు.
టికెట్ల రేట్ల పెంపుపై ప్రతిపాదనలు
కార్పోరేషన్లలో ఏసీ థియేటర్లలో గరిష్టంగా రూ. 150, కనిష్ట ధర రూ. 50, కార్పోరేషన్లలో నాన్ ఏసీ థియేటర్లలో గరిష్ట ధర రూ. 100, కనిష్ట ధర రూ. 40 గా ఉండాలని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మంత్రి పేర్ని నానికి ప్రతిపాదించారు. కార్పోరేషన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో ఏసీ థియేటర్లలో గరిష్ట ధర రూ. 100, కనిష్ట ధర రూ. 40 గా ప్రతిపాదించారు. కార్పోరేషన్ మినహా మిగిలిన ప్రాంతాల్లో నాన్ ఏసీ థియేటర్లలో గరిష్ట ధర రూ. 80, కనిష్ట ధర 30 గా ప్రతిపాదించారు. నాలుగు వారాల సమయం ఇస్తే సినిమా థియేటర్ల లైసెన్సులను రెన్యూవల్ చేసుకొంటామన్నారు.