యల్లనూరులో జంట హత్యలు: ప్రత్యర్ధుల ఇళ్లపై మృతుల బంధువుల దాడి, ఉద్రిక్తత

Published : Jun 20, 2021, 12:10 PM IST
యల్లనూరులో జంట హత్యలు:  ప్రత్యర్ధుల ఇళ్లపై మృతుల బంధువుల దాడి, ఉద్రిక్తత

సారాంశం

అనంతపురం జిల్లా యల్లనూరు మండలం అరవీడు గ్రామంలో జంట హత్యలు  ఉద్రిక్తతకు దారి తీసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ప్రత్యర్థులు దారికాచి దారుణంగా హత్యచేశారు. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు ప్రత్యర్ధులైనా నాగేష్, రమేష్ ఇళ్లపై దాడికి దిగారు.  ఈ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 


తాడిపత్రి: అనంతపురం జిల్లా యల్లనూరు మండలం అరవీడు గ్రామంలో జంట హత్యలు  ఉద్రిక్తతకు దారి తీసింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ప్రత్యర్థులు దారికాచి దారుణంగా హత్యచేశారు. మృతుల బంధువులు, కుటుంబసభ్యులు ప్రత్యర్ధులైనా నాగేష్, రమేష్ ఇళ్లపై దాడికి దిగారు.  ఈ గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. 

ప్రస్తుతం అరవేడు గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతోందోననే ఆందోళన నెలకొంది. అరవీడులో ఇద్దరు వైసీపీ కార్యకర్తలను ప్రత్యర్ధులు హత్య చేశారు.  అరవీడు, వేటాపురం గ్రామాల మధ్య రాజగోపాల్,  నారాయణప్పలను ప్రత్యర్ధులు హత్య చేశారు. దేవాలయ భూముల విషయంలో గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య విభేదాలు చోటు చేసుకొన్నాయి.

 దీని కారణంగా వీరు హత్యకు గురైనట్టుగా స్థానికులు చెబుతున్నారు. హత్యకు గురైన ఇద్దరు కూడ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు. జంట హత్యల తర్వాత చోటు చేసుకొన్న  ఘటనల నేపథ్యంలో గ్రామంలో తాడిపత్రి డీఎస్పీ చైతన్య నేతృత్వంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్