జగన్ కళ్లలో ఆనందం కోసమే.. చంద్రబాబు, లోకేష్‌లపై ఆరోపణలు: కొడాలి నానికి దేవినేని కౌంటర్

By Siva KodatiFirst Published Jun 19, 2021, 3:40 PM IST
Highlights

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉదయం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి అవాస్తవాలు చెబుతున్నారని ఉమా ఆరోపించారు

వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఉదయం మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటరిచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి మంత్రి అవాస్తవాలు చెబుతున్నారని ఉమా ఆరోపించారు. సీఎం జగన్ కళ్లలో ఆనందం కోసమే చంద్రబాబు, లోకేశ్‌లపై నాని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రూ.5,308 కోట్లు చెల్లించాల్సి వుందని చెబుతున్నారని.. కానీ రూ.1,637 కోట్లు మాత్రమే ఇచ్చి అంతా చెల్లించినట్లు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లు, చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని దేవినేని డిమాండ్ చేశారు. దళారులు, వ్యాపారులు కుమ్మక్కై రైతులను దోచేసుకుంటున్నారని ఉమా ఆరోపించారు. 

Also Read:తుప్పుగాడు చంద్రబాబు, పప్పుగాడు లోకేష్: కొడాలి నాని తిట్లదండకం

అంతకుముందు శనివారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబును తుప్పుగాడిగా, నారా లోకేష్ ను పప్పుగాడిగా అభివర్ణించారు. పప్పుగాడు లోకేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతోందని తుప్పుగాడు చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారని, నెల రోజుల్లో చెల్లింపులు జరపాలని అడిగారని, పిచ్చికాగితం మీద నాలుగు మాటలు రాశాడని ఆయన అన్నారు.

కొడాలి నాని శనివారం మీడియాతో మాట్లాాడరు. అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. మనిషివా, దున్నపోతువా అని కూడా చంద్రబాబును ప్రశ్నించారు. రైతులకు చంద్రబాబు బకాయిలు పెట్టిపోతే తాము చెల్లించామని ఆయన చెప్పారు. చంద్రబాబు, నారా లోకేష్ ఇంటికి పరిమితమై కాలక్షేపం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల ధాన్యం కొనుగోళ్లకు 21 రోజుల లోపల డబ్బులు చెల్లిస్తున్నామని ఆయన చెప్పారు. కేంద్రం ఇవ్వాల్సిన అడ్వాన్స్ ఇవ్వకపోయినా రాష్ట్ర ఖజానా నుంచి చెల్లిస్తున్నామని ఆయన అన్నారు. 

click me!