ఏపీలో నిలకడగానే కరోనా: కొత్తగా 5674 మందికి పాజిటివ్.. తూర్పుగోదావరిలో అత్యధికం

Siva Kodati |  
Published : Jun 19, 2021, 05:44 PM IST
ఏపీలో నిలకడగానే కరోనా: కొత్తగా 5674 మందికి పాజిటివ్.. తూర్పుగోదావరిలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,674 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,44,917కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,674 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,44,917కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 45 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,269కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి విజయనగరం 2, ప్రకాశం 2, అనంతపురం 3, తూర్పుగోదావరి 5, చిత్తూరు 9, గుంటూరు 5, కర్నూలు 2, నెల్లూరు 1, కృష్ణ 5, విశాఖపట్నం 3, శ్రీకాకుళం 3, పశ్చిమ గోదావరి 3 కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 8,014 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 17,67,404కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,03,935మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,10,50,846కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 65,244మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 326, చిత్తూరు 854, తూర్పుగోదావరి 1068, గుంటూరు 360, కడప 368, కృష్ణ 435, కర్నూలు 173, నెల్లూరు 235, ప్రకాశం 451, శ్రీకాకుళం 245, విశాఖపట్నం 215, విజయనగరం 166, పశ్చిమ గోదావరిలలో 758 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

నన్ను సార్ అంటే చాక్లెట్ ఇవ్వాలి విద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Nara Lokesh Fun With Students
Nara Lokesh Speech: టీడీపీ కార్యకర్తలకు పూనకాలు తెప్పించే నారాలోకేష్ పవర్ ఫుల్ స్పీచ్ | TDP