ఎనమలకుదురులో ఉద్రిక్తత: టీడీపీ నిరసనను అడ్డుకొనేందుకు యత్నించిన వైసీపీ

By narsimha lode  |  First Published Nov 22, 2022, 11:56 AM IST

ఎన్టీఆర్  జిల్లా  ఎనమలకుదురులో  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.  టీడీపీ,  వైసీపీ శ్రేణులు  పోటా పోటీ నినాదాలు  చేసుకున్నారు.  ఇదేం కర్మ అంటూ  టీడీపీ  చేపట్టిన  నిరసన  కార్యక్రమాన్ని  అడ్డుకొనే  ప్రయత్నం  చేసింది. 


విజయవాడ:ఎన్టీఆర్  కృష్ణా  జిల్లా  ఎనమలకుదురులో  మంగళవారంనాడు  ఉద్రిక్తత  చోటు  చేసుకుంది.  ఎనమలకుదురులో బ్రిడ్జి  వద్ద టీడీపీ  ఇవాళ  నిరసనకు  పిలుపునిచ్చింది.  ఎనమలకుదురులోని  బ్రిడ్జి  వద్ద  టీడీపీ నిరసనకు  పిలుపునిచ్చింది.  ఇదేం  కర్మ  అంటూ  టీడీపీ  కార్యకర్తలు  నినాదాలు  చేశారు. టీడీపీ  నిరసనను  అడ్డుకొనేందుకు  వైసీపీ  అడ్డుకొనేందుకు  వైసీపీ  నేతలు  ప్రయత్నించారు. మాజీ  ఎమ్మెల్యే  బోడే  ప్రసాద్,  మాజీ  ఎంపీ  కొనకళ్ల నారాయణరావులను  అడ్డుకొనేందుకు  వైసీపీ  శ్రేణులు  ప్రయత్నించాయి.  టీడీపీకి  వ్యతిరేకంగా  వైసీపీ  కార్యకర్తలు  నినాదాలు  చేశారు.  టీడీపీ,  వైసీపీ  శ్రేణులు పోటాపోటీగా  నినాదాలు  చేశారు.  దీంతో  ఉద్రిక్తత  నెలకొంది.  వైసీపీ  శ్రేణులను పోలీసులు  అక్కడి  నుండే  పంపించే  ప్రయత్నం చేశారు.రాష్ట్ర  వ్యాప్తంగా  ఇదేం  కర్మ అనే  కార్యక్రమాలను టీడీపీ  చేపట్టింది.  ఇందులో  భాగంగానే  ఎనమలకుదురులో  బ్రిడ్జి  వద్ద టీడీపీ  నిరసన  కార్యక్రమం చేపట్టింది.ఎనమలకుదురు  బ్రిడ్జి  వద్ద  టీడీపీ, వైసీపీ శ్రేణులు భారీగా  మోహరించారు.  ఇరువర్గాలను  పోలీసులు  అక్కడి నుండి  చెదరగొట్టేందుకు  ప్రయత్నిస్తున్నారు.


 

Latest Videos

click me!