గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో సోమవారం నాడు సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
గుంటూరు: గుంటూరు జిల్లాలోని వెలగపూడిలో సోమవారం నాడు సాయంత్రం మళ్లీ ఉద్రిక్తత నెలకొంది.
రోడ్డుకు ఆర్చీ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ విషయమై ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది.
ఎంపీ నందిగం సురేష్ ప్రోత్సాహంతోనే రాళ్ల దాడి జరిగిందని ప్రత్యర్ధి వర్గం ఆరోపిస్తోంది. మృతదేహనికి పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత డెడ్ బాడీని సోమవారం నాడు సాయంత్రం వెలగపూడికి తీసుకువచ్చారు.
మహిళ మృతదేహంతో వెలగపూడిలో బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. ఎంపీ నందిగం సురేష్ పై ఎప్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.ఎంపీ సురేష్ ను అరెస్ట్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. అంతేకాదు ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఈ ఘటనతో తనకు సంబంధం లేదని ఎంపీ నందిగం సురేష్ తేల్చి చెప్పారు.